అందరి మధ్యే బ్లూ ఫిలిం చూసిన మంత్రి..

Posted November 11, 2016

karnataka minister tanveer sait watched blue films at Tipu Jayanti functionఆయ‌న ఓ రాష్ట్రానికి మంత్రి. ఎంతో బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న. అందరి మధ్యే మొబైల్‌ ఫోన్‌ లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డారు ఇంకేం ఉంది రచ్చ రచ్చ …

టిప్పు జయంతి సందర్భంగా గురువారం కర్ణాటక లోని రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ఘనకార్యం చేశారు. మంత్రి గారు ఈ విషయం అన్ని వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో ప్ర‌భుత్వం ప‌రువు కూడా గంగ‌లో క‌లిసింది.

కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్ రాయ‌చూర్‌లో టిప్పు జ‌యంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న మొబైల్‌లో నీలి చిత్రాలు చూస్తూ మీడియా కెమేరాల‌కు చిక్కారు. ఈ వార్త‌లు అన్ని ఛానెళ్ల‌లో ప‌దే ప‌దే ప్ర‌సారం కావ‌డంతో ఈ మ్యాట‌ర్ క‌ర్ణాట‌క‌లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. దీంతో సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది.

అయితే సదరు మంత్రి తన్వీర్‌ సేఠ్ నిస్సుగ్గుగా తనను తాను సమర్థించుకున్నారు. ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు సమాధానం ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై మ‌రిన్ని విమ‌ర్శ‌లు రావ‌డంతో టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. మంత్రివర్యుడు . ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్‌ లు మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తన్వీర్‌ సేఠ్‌ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గ‌తంలో కూడా క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీలోనే ఏకంగా కొంద‌రు ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్స్ చూస్తూ మీడియాకు అడ్డంగా బుక్ అయిన సంగ‌తి తెలిసిందే. వీళ్లకి ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో ..