కార్తి కూడా ఆమె మాయలో..!

Posted November 28, 2016

Image result for keerthy suresh and karthi new movie

మలయాళం నుండి ఏ టైంలో టాలీవుడ్ కు అడుగుపెట్టిందో కాని కీర్తి సురేష్ ఇప్పుడు సౌత్ లో క్రేజీ బ్యూటీల్లో ఆమె ఒకరు. తెలుగు తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోల ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు కార్తితో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుందట. రీసెంట్ గా కాష్మోరాతో సూపర్ హిట్ అందుకున్న కార్తి ఆ సినిమా తర్వాత చేస్తున్న విక్రం దర్శకత్వంలోని సినిమాకు కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఓకే చేశారట.

ఇప్పటికే కోలీవుడ్ లో విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ సరసన నటించి మెప్పించిన కీర్తి ఇప్పుడు కార్తితో కూడా రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక తెలుగులో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో పాటుగా కుర్ర హీరోలతో కూడా జతకట్టేందుకు సై అంటుంది. చూస్తుంటే అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా కీర్తి క్వీన్ గా అవతరించినుందని చెప్పొచ్చు.

తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ కేవలం నేను శైలజ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక ఎలాగు అవకాశాలొచ్చాయి కాబట్టి వాటిని సరిగ్గా వాడుకుంటే అమ్మడి కెరియర్ కు ఇక తిరుగుండదని చెప్పొచ్చు.