ఈసారి ‘డ్యూయెట్’ పాడేస్తున్న కార్తి..!

Posted November 12, 2016

kd12166ఈ సంవత్సరం ఇప్పటికే ఊపిరి, కాష్మోరా హిట్లతో కార్తి తెలుగులో కూడా తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడని చెప్పొచ్చు. కాష్మోరా సినిమా తమిళంలో కన్నా తెలుగులో బెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అయితే ఈ క్రమంలో తన తర్వాత సినిమా రిలీజ్ ను కూడా తెలుగులో ప్లాన్ చేస్తున్నాడు కార్తి. మణిరత్నం డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా కోలీవుడ్ లో ‘కాట్రు వేళయిదే’ టైటిల్ తో వస్తుండగా తెలుగులో ‘డ్యూయెట్’ అని రాబోతుంది.

కొద్ది పాటి గ్యాప్ తర్వాత ఓకే కణ్మనితో హిట్ అందుకున్న మణిరత్నం ఈసారి డ్యూయెట్ సినిమాతో వస్తున్నాడు. తెలుగులో మణి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తి గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పనిలేదు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఓకే బంగారం సినిమా కూడా దిల్ రాజు రిలీజ్ చేసి లాభాలు పొందడంతో మణిరత్నం మళ్లీ డ్యుయెట్ ను తెలుగులో దిల్ రాజుకే ఇచ్చాడు.

మణిరత్నం డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కార్తి పైలెట్ గా నటిస్తున్న ఈ సినిమా మణి మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2017 మార్చ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.