కరుణ అస్త్ర సన్యాసం..నేడో రేపో..

Posted December 15, 2016

karunanidhi

తమిళనాడు రాజకీయాలు నిన్న మొన్నటివరకు వార్ధక్యం లో కొట్టు మిట్టాడుతున్నాయి అనుకున్నాం ఇప్పుడు నైరాశ్యం లో మునిగి పోయాయి అనే చెప్పొచ్చు. యువ నాయకులు లేకపోవటం ఉన్న నాయకులు లో పోరాట పటిమ చిట్టా శుద్ధి లేక పోవటం వంటి కారణాలు తమిళ రాజకీయాల్ని వెంటాడుతున్నాయి. ఆలిండియా ద్రావిడ మున్నేట్రగా కళగం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ద్రావిడ మున్నేట్రగ కజగం .ఈ రెండు పార్టీ ల్లో నిన్నటి వరకు నాయకత్వం కూడా అదే రేంజ్ లో ఉండేది. ఎమ్ జీ ఆర్ ,జయలలిత కరుణానిధి వీరి ముగ్గురు మధ్యలోనే తిరిగేది మాధ్యలో స్టాలిన్ వంటివాళ్ళు వున్నా అంత రక్తి కట్టిన సందర్భాలు తక్కువె వారసత్వపరం గా కరుణానిధి కొడుకే ఐనా ఆయన్ని కాదని రాజకీయం చేసేంత చొరవ లేదు స్టాలిన్ కి  .కానీ నైతిక విలువలున్నాయి అనేందుకు స్టాలిన్ కట్టుబడ్డాడు అనే చెప్పాలి,నిన్నటి వరకు నాయకత్వ సంక్షోభంలో ఉన్న జయ పార్టీ ని, ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకొంటే వాళ్లకి పెద్ద పనేకాదు కేవలం 20 మంది ఎమ్ఎల్ఏ లను తమ వైపు తిప్పుకోవడం కూడా కష్టం కాదు. కానీ విలువలకి విలువ ఇచ్చిన ఘనత ని దక్కించుకున్నారు .జయలలిత నిష్క్రమణ తర్వాత కరుణ ఏమనుకున్నారో ఏమో తనకి ధీటైన జోడి లేరనే భావన వచ్చేసిందట అస్త్ర సన్యాసం చేసేందుకే నిర్ణయం తీసుకున్నారట..త్వరలో ఆ పార్టీ లో జరిగే సమావేశం లో స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించి తప్పుకొంటున్నారు.కరుణ నిర్ణయం తో కొత్త గా జయ పార్టీ ప్రధాన కార్య దర్శిగా ప్రకటించబడిన శశి కల స్థాయి ఏమిటో తేలిపోయింది…ఏమైనా అనుభవం ముందు చతురత పనిచేయదు అనేది కరుణ నిర్ణయం ద్వారా నిరూపణ  అయ్యింది అనేది సత్యం …