అందరూ వెళ్లిపోతుంటే.. కాసు కుటుంబం చేరుతోంది

Posted December 5, 2016

kasu krishna reddy his son join jagan ysrcp party
వైసీపీలో నుంచి ఈ మధ్య జంపింగ్ జపాంగ్స్ ఎక్కువయ్యారు. ఎమ్మెల్యేలు భారీ ఎత్తున టీడీపీలోకి క్యూ కట్టారు. జగన్ కి షాకిస్తూ… నేనంటే నేనంటూ సైకిలెక్కారు. జగన్ కు సన్నిహితులుగా పేరున్న బడా నాయకులు కూడా ఎంచక్కా… బాబు దగ్గరకి వచ్చేశారు. ఇంకా కొంతమంది వైసీపీ నుంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాసు కుటుంబం.. జగన్ పార్టీలోకి వెళ్లడానికి నిర్ణయించుకుంది.

దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పారు. ఆయన కుమారుడు కాసు కృష్ణారెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు. వైఎస్ ను రాజా అని పిలిచే సాన్నిహిత్యం కృష్ణారెడ్డికి ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఎందుకనో ఆయన జగన్ వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాంగ్రెస్ పరిస్థితి ఏం మారలేదు… కాబట్టి ఇక ఆ పార్టీలో ఉండొద్దని నిర్ణయించుకున్నారట. ఎలాగూ తనకు రిటైర్ మెంట్ వయస్సు వచ్చేసింది కాబట్టి.. తన కుమారుడిని వైసీపీలోకి పంపిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే కాసు తనయుడు మహేశ్ రెడ్డి.. లోటస్ పాండ్ లో జగన్ ను కలిశారు. ఇక ముందు కలిసి నడుద్దామని షేక్ హ్యాండిచ్చారు. ఈనెల 16న నరసారావుపేటలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సభలోనే కాసు కుటుంబం … వైసీపీలోకి గ్రాండ్ ఇవ్వనుందని సమాచారం.

ఒకవైపు ఎమ్మెల్యేలంతా జగన్ ను వీడిపోతుంటే.. ఈ టైమ్ లో కాసు కుటుంబం ఎందుకు చేరుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ లో ఉండలేరు. టీడీపీలోకి వెళ్లలేరు. మరొక ఆప్షన్ లేదు కాబట్టే వైసీపీలోకి కాసు మహేశ్ రెడ్డి వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు జనం.