వైసీపీ దాడుల్లో ..పలువురికి గాయాలు

Posted December 10, 2016

kasu mahesh reddy bike rally tdp ycp party leaders fighting in narasaraopetనరసారావు పేట నియోజక వర్గం రావిపాడులో వైసీపీ తెలుగు దేశం మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ దాడిలోతెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ తెలుగుదేశం ఆధ్వర్యంలో రావిపాడులోని ఎన్‌టీఆర్‌ విగ్రహం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.కాసు మహేష్‌ రెడ్డి ప్రదర్శనలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనాలతో వైసీపీ కార్యకర్తలు నకరికల్లు వెళ్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జోజయ్య ప్రయాణిస్తున్న కారుకు ద్విచక్ర వాహనాలు అడ్డంగా ఉండటంతో హారన్‌ మోగించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు జోజయ్యపై జెండా కర్రలతో దాడి చేశారు. అడ్డువెళ్లిన చిన్నయ్యపై కూడా దాడి జరిగింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలనీ, కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరుతూ టీడీపీ నాయకులు గంటసేపు రాస్తారోకో చేశారు. టీడీపీ రాస్తారోకో నేపథ్యంలో నకరికల్లు నుంచి రావిపాడు గుండా నరసరావుపేట రావాల్సిన కాసు మహేష్‌రెడ్డి ప్రదర్శనను పోలీసులు అడ్డరోడ్డు వద్ద నిలిపి వేసి రొంపిచర్ల గుండా పట్టణానికి మళ్లించారు. దాడి కి సంబంధించి ఫిర్యాదు మేరకు 20 మంది కేసు నమోదు చేసారు .

రావిపాడులో జరిగిన సంఘటనను కాసు మహేష్‌రెడ్డి ఖండించారు. ఈ సంఘటన జరగటం దురదృష్టకరమని, తాను క్షమాపణ చెపుతున్నట్టు ప్రకటించారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు