కాటమరాయుడు …తెలుగు బుల్లెట్ రివ్యూ

0
40

 Posted March 24, 2017

Katamarayudu Review
కాటమరాయుడు క్లుప్తంగా…ఓ ముక్కుసూటి మనిషి.తప్పుని అడ్డుకోడానికి,సమస్య పరిష్కరించడానికి కండబలాన్ని దండిగా వాడే ఓ కరకు మనిషి.కానీ తమ్ముళ్ళంటే పిచ్చి ప్రేమ.అమ్మాయిలకి ఆమడ దూరం.అలాంటి ఓ పల్లెటూరి మనిషి తమ్ముళ్ల ప్లాన్ తో ప్రేమలో పడడం ..ఆ ప్రియురాలి కుటుంబం వెనుక ఊహించని గతం.ఈ పరిస్థితుల్లో కాటమరాయుడు ఏమి చేసాడు అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

అజిత్ హీరో గా నటించిన తమిళ్ సూపర్ హిట్ మూవీ వీరం రీమేక్ కాటమరాయుడు.అయితే దాదాపు ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో 30 ఏళ్ళనాడు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఓ సినిమా వచ్చింది.ఇక రాజశేఖర్ హీరోగా వచ్చిన మా అన్నయ్య బంగారం,హరికృష్ణ హీరోగా వచ్చిన లాహిరిలాహిరిలాహిరిలో కూడా కాస్త ఈ లైన్ లో వచ్చిన కధలే.అయితే వాటికి వీటికి వున్న పెద్ద తేడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

స్క్రీన్ ప్రెజన్స్.

తెలుగు నేటివిటీ వున్న కధకి ఓ మాస్ హీరో ,కాస్త క్లాస్ డైరెక్టర్ తోడు అయితే ఎలా ఉంటుందో కాటమరాయుడు అలా వుంది.వీరం లో మాస్ టచ్ ఎక్కువగా ఉంటే కాటమరాయుడు దర్శకుడు డాలీ మాత్రం అన్నదమ్ముల మధ్య అనుబంధం,పవన్,శృతి మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.ఫస్ట్ హాఫ్ అంతా సరదాసరదాగా సాగిపోయింది.ఇక సెకండ్ హాఫ్ హీరో వీరవిహారం చూద్దామనుకునే వారిని ఇంకోసారి ఆశ్చర్య పరిచాడు.హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఎంత దృష్టి పెట్టాడో ,భావోద్వేగాలు రాబట్టడం మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాడు. అందుకే కాటమరాయుడు పేరులో మాస్ ఎసెన్స్ కనిపిస్తున్నా సినిమా చూస్తున్నంత సేపు ఎక్కోడోచోట మనసుకి దగ్గరయ్యే సన్నివేశాలు వస్తూనే ఉంటాయి.ఇలా వీరం లాంటి ఓ మాస్ సినిమాకి క్లాస్ టచ్ ఇస్తే కాటమరాయుడు అవుతుంది.

ఇక కాటమరాయుడు గా పవన్ కళ్యాణ్ నటన పీక్స్ లో వుంది.పవన్ నటనలో సహజంగా ఓ హుషారు,జోరు ఉంటుంది.ఈసారి కాటమరాయుడులో దానికి తోడు చిన్నపాటి గాంభీర్యం తోడై పవన్ లోని సరికొత్త కోణాన్ని చూసే అవకాశం కలిగింది.పవన్ పరిణితి చూసాక పక్వానికి వస్తున్న పండు రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాల్లోనే ఉండి ఆ రుచి చూపిస్తే బాగుంటుందని అనిపించింది.ఇక హీరోయిన్ శృతి ,పవన్ అన్నదమ్ముల క్యారెక్టర్ వేసిన నటులు,విలన్స్ ప్రదీప్ రావత్,రావు రమేష్ ఎవరి పరిధిలో వాళ్ళు బాగా చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే మాటలు రాసిన బుర్రా సాయి మాధవ్,ఫైట్స్ రూపకల్పనలో రామ్ లక్ష్మణ్ అందరి కన్నా ముందున్నారు.ఈ రెండు విభాగాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అనూప్ రూబెన్స్ పాటల కన్నా నేపధ్య సంగీతం డామినేట్ చేసింది.మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ చేదు అనుభవాన్ని మరిచిపోయేలా నార్త్ స్టార్ బ్యానర్ కి,నిర్మాత శరత్ మరార్ కి ఓ మంచి హిట్ సినిమా పడినట్టే..

పంచ్ లైన్ … వీరమ్ కి క్లాస్ టచ్ ఇస్తే కాటమరాయుడు
రేటింగ్ … 3 .25 /5 ..