రద్దు నిర్ణయం మంచిదే సిఎం కేసిఆర్

Posted December 16, 2016

kcr about demonitisationతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి శాసన సభ లో ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని దేశప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చర్యలు తీసుకున్నామని, ప్రధాని మోదీని కలిసి ప్రజల కష్టాలను వివరించామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చిల్లర కొరత తీర్చాలని ఆర్‌బీఐకి లేఖలు రాశామని సభకి చెప్పారు.

నగదు రహిత లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని ఇప్పటికే ఇబ్రహీంపూర్‌ను నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చామని, నగదు రహిత అమలుకు కేబినెట్‌ సబ్‌కమిటీ వేశామని కేసీఆర్‌ చెప్పారు. టీఎస్‌ వాలెట్‌నుతీసుకు రానున్నట్టు ప్రకటించారు, నోట్ల రద్దు పై సభ లో చర్చ అవసరం లేదని ప్రజల ఇబ్బందులను మాత్రమే సభ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై పడిన భారంపైనే చర్చ జరగాలని, నగదు రద్దు వల్ల తొలి మూడు నెలలు ఆదాయం తగ్గుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.