కేసీఆర్- కేవీపీ జోడీ కుదిరిందా?

Posted December 13, 2016

kcr and kvp close friends
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అటు కేవీపీ ఏమో కాంగ్రెస్ నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. అయితే ఈ ఇద్ద‌రు నేతలు ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు కానీ ఇద్ద‌రి మ‌ధ్య మంచి దోస్తానా ఉందంటారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. ఇందుకు కొన్ని కార‌ణాల‌ను చూపిస్తారు ఆ నాయ‌కులు.

తెలంగాణ ఉద్య‌మం ప‌తాక‌స్థాయికి చేరిన త‌రుణంలో కేసీఆర్.. ఏ ఒక్క ఆంధ్ర నాయ‌కుడిని వ‌ద‌ల్లేదు. అంద‌రినీ విమ‌ర్శించారు. కానీ కేవీపీని ప‌ల్లెత్తు మాట అనలేదు. ఓవైపు స‌మైక్య ఆంధ్ర కోసం కేవీపీ ఆరోజుల్లో గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేసినా ఎప్పుడు కేసీఆర్ మాత్రం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌లేద‌ట‌. ఎందుకంటే వారి మ‌ధ్య అంత‌టి అనుబంధం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మ‌రింత ఎక్కువ‌య్యింద‌ని టాక్. ముఖ్యంగా ఇద్ద‌రూ ఇప్పుడు క‌లిసి మాట్లాడుకొని ముందుకు సాగుతున్నార‌ని తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ధుయాష్కీ లాంటి నేత‌ల మాట‌. కాంట్రాక్టులు, సెటిల్ మెంట్లు అన్నీ జంట‌గా చేసుకుపోతున్నార‌ట‌. అందుకే ఈ ఇద్ద‌రి జోడీ అదిరిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు మ‌ధుయాష్కీ.

కేసీఆర్ .. కేవీపీ విష‌యంలో పాజిటివ్ గా ఉన్నారు కాబ‌ట్టి టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఢిల్లీలో కేవీపీతో బాగా క్లోజ్ గా ఉంటార‌ట‌. కేవీపీకి తెలంగాణ‌లో ఏ ప‌ని కావాల‌న్నా… క్ష‌ణాల్లో అది జ‌రిగిపోయేలా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి కేసీఆర్ స్నేహితుడికి అంత సాయం చేయక‌పోతే ఎలా అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు మ‌ధుయాష్కీ.