ఈ ఎమోషన్.. ఇక్కడిది కాదు, అక్కడిది

0
80

 Posted April 30, 2017 at 12:32

kcr angry on police forceతెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ పోలీసుల్ని అక్కున చేర్చుకున్నారు. ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా పోలీస్ శాఖపైనే మొదటి ఏడాది దృష్టి పెట్టారు. అత్యాధునిక వాహనాలు, టెక్నాలజీ, సిబ్బంది ఇలా ఏదడిగితే అది సమకూర్చారు. ఉద్యమ సమయంలో మనపై ప్రతాపం చూపినవాళ్లను నెత్తినపెట్టుకోవడమేమిటని గులాబీ నేతలు అభ్యంతరం చెప్పినా.. లా అండ్ ఆర్డర్ దృష్టిలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారు.

కానీ ఓయూ శతాబ్ది ఉత్సవాలు వచ్చేసరికి సీన్ రివర్సైంది. అప్పటివరకూ ఇండియాలోనే నంబర్ వన్ ర్యాంకులో ఉన్న తెలంగాణ పోలీసులు.. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఉత్సవంలో ముఖ్యమంత్రిని మాట్లాడొద్దని సూచించడం సంచలనం రేపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ సీఎంకూ ఇలాంటి అవమానవం జరిగింది. ఏ వర్సిటీలో ఉద్యమం చేశారో.. అక్కడే మాట్లాడలేకపోవడం.. సీఎంను బాగా ఇబ్బందిపెట్టింది.

అయితే ఓయూ ఘటనపై ఏమీ మాట్లాడలేకపోయిన కేసీఆర్.. పోలీసులపై కసి అంతా వరంగల్ సభ సాకుతో తీర్చుకున్నారు. వరంగల్ సభకు వస్తున్నవారిని కూడా ట్రాఫిక్ జామ్ అయిందని వెనక్కు పంపడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించింది. అప్పటికే ఓయూ కాక మీద ఉన్న కేసీఆర్.. వరంగల్ సభలో ఇలా చేశారేంటని పోలీసుల్ని దులిపేశారు. దీంతో దిమ్మెరపోవడం ఉన్నతాధికారుల వంతైంది.