జ‌గ‌న్ పై కేసీఆర్ అసంతృప్తి!!

Posted February 5, 2017

kcr disappointed for jagan
తెలంగాణ సీఎం కేసీఆర్ …. వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌ట్నుంచి టాక్ ఉంది. తెర వెనుక ఇద్ద‌రి మ‌ధ్య మంచి దోస్తీ ఉంద‌ని చెబుతారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే కేసీఆర్… జ‌గ‌న్ ఎప్పుడూ తిట్టుకున్న సంద‌ర్భాలు లేవు. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో పాటు కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఏకిపారేసే కేసీఆర్… ఎందుక‌నో జ‌గ‌న్ టాపికే ఎత్త‌రు. అంతెందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి… జ‌గ‌న్ అనుమ‌తితోనే టీఆర్ఎస్ లో చేరార‌న్న ఊహాగానాలున్నాయి. అలాంటి టీఆర్ఎస్- వైసీపీ దోస్తీలో చిన్న గ్యాప్ వ‌చ్చింద‌న్న అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్.. వ‌ర్గీక‌ర‌ణ కోసం అఖిల‌ప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 6న ఈ భేటీ జ‌రగాల్సి ఉన్నా.. చివ‌రి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ వాయిదా విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే… ఈ భేటీకి అన్ని పార్టీల‌ను ఆహ్వానించిన కేసీఆర్… వైసీపీని మాత్రం లైట్ తీసుకున్నారు. వైసీపీకే ఆహ్వానమే అంద‌లేదు. అంతేకాదు పార్టీనేత‌లు కూడా వైసీపీని ఇన్వ‌యిట్ చేస్తే… బావుంటుంద‌ని కోరార‌ట‌. కానీ అందుకు కేసీఆర్ స‌సేమిరా అన్నార‌ట‌. ఆ ప్ర‌స్తావ‌నే మ‌రోసారి తీసుకురావ‌ద్ద‌ని చెప్పార‌ట‌.

వైసీపీ విష‌యం ఎత్త‌గానే కేసీఆర్… సీరియ‌స్ కావ‌డంతో ఏదో జ‌రిగింద‌ని టీఆర్ఎస్ క్యాడ‌ర్ అనుకుంటున్నారు. జ‌గ‌న్ తో ఏదో గ్యాప్ వ‌చ్చి ఉంటుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబును కౌంట‌ర్ చేయ‌డంలో జ‌గ‌న్ ఘోరంగా విఫ‌లం కావ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని టాక్. ఏపీలో స‌మ‌స్యలున్నా… వాటిని ఒడిసి ప‌ట్టుకొని… బాబుపై ఒత్తిడి పెంచ‌డంలో జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అందుకే ఇక జ‌గ‌న్ ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నార‌ట‌. ఇక మీద‌ట వైసీపీని కూడా ఇత‌ర పార్టీల్లానే ప్ర‌త్య‌ర్థిగా భావించాల్సిందేన‌ని పార్టీ నాయ‌కుల‌కు సూచించార‌ట‌.