కేసీఆర్ డైనమిక్ లీడర్!!

Posted January 2, 2017

kcr dynamic leader
ఓవైపు విపక్షాలేమో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే… సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఏమో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ డైనమిక్ లీడర్ అని తెగ పొగిడేశారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలుస్తుందని మెచ్చుకున్నారు.

ప్రస్తుతం నరసింహన్ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ ఆయన సన్నిహితంగానే ఉంటారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఆయనకు కొంచెం అభిమానం ఎక్కువ అని టాక్. ఎంత అభిమానమున్నా ఇంత ఓపెన్ గా సీఎం పై ప్రశంసలు కురిపించడం అంటే మాటలు కాదు.

గవర్నర్ నరసింహన్ ప్రశంసలు చూస్తుంటే… సీఎం కేసీఆర్ పాలన నిజంగానే ఆ స్థాయిలో ఉందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ఆ ప్రశంసలకు అన్ని విధాలా అర్హుడని చెబుతున్నారు. అయితే దీనిపై విపక్షాలు మాత్రం గుస్సా అవుతున్నాయి. కేసీఆర్ పై గవర్నర్ ప్రశంసలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన మాటలను భూతద్దంలో చూసి… ఆనందపడొద్దని సూచిస్తున్నారు.