అవసరానికి అల్లుడు గుర్తొస్తాడా కేసీఆర్..?

0
84

Posted April 19, 2017

kcr giving full power to harish rao for trs party meeting at warangalతెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ.. ఉద్యమ సమయంలో జరిగిన భారీ బహిరంగ సభలకు తీసిపోకూడదని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆలోచన. అందుకే ప్లీనరీ తర్వాత జరిగే వరంగల్ సభ కోసం ఎప్పట్నుంచో ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలందరితో ప్రత్యేకంగా మాట్లాడిన కేసీఆఱ్.. సభను ఊహించిన దాని కంటే ఎక్కువ విజయవంతం చేయాలని, సభ చూసి ప్రత్యర్థులు భయపడాలని చెప్పారు. కానీ కేసీఆర్ చెప్పడమే కానీ.. నేతలు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో మరోసారి గులాబీ తురుపుముక్క రంగంలోకి దిగింది.

టీఆర్ఎస్ లో మొదట్నుంచీ టాస్క్ మాస్టర్ గా పేరుంది హరీష్ కే. కేసీఆర్ ఏదేనా పని అప్పగిస్తే.. చెప్పిన దానికి మించిన విజయవంతం చేయడం హరీష్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కేసీఆర్ కూడా హరీష్ కు పని అప్పగిస్తే చాలా నిశ్చింతగా ఉంటారు. ఇప్పుడు పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సభను విజయవంతం చేసే బాధ్యత కూడా హరీష్ భుజస్కంధాలపైనే పెట్టారు కేసీఆర్. సభ విజయవంతం కాకపోతే పరువు పోతోందని, నేతలు అంతర్గత విభేదాలతో బజార్న పడితే ఎలాగని కేసీఆర్ హరీష్ ను పురమాయించి వరంగల్ పంపారు.

ఇక హరీష్ తనదైన శైలిలో ఇప్పటికే అన్ని వర్గాల నేతలకు టచ్ లోకి వెళ్లారని, ఇక వరంగల్ సభ దిగ్విజయంగా జరుగుతుందని గులాబీ శ్రేణులకు కూడా ధీమా వచ్చేసింది. అదీ హరీష్ అంటే. ఇక కేటీఆర్ ను కొంతకాలంగా హైలైట్ చేస్తున్న కేసీఆర్.. ఉద్దేశపూర్వకంగా హరీష్ పై శీతకన్నేశారు. కానీ టాస్క్ మాస్టర్ అయిన హరీష్.. తన టాలెంట్ తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అంతా బాగుందనుకున్నచోట మాత్రమే కేటీఆర్ పనికొస్తారని, ఏమీ లేదు అన్నచోట ఏదైనా అద్భుతం చేయాలంటే హరీష్ కే సాధ్యమంటున్నారు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు. వింటున్నారా కేసీఆర్.