వరదలపై దృష్టిపెట్టిన కెసిఆర్..

  kcr giving orders ktr all ministers help flood effected people

రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతవారణ శాఖ చెబుతున్నందున అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులకు కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి, ఇండ్లలోకి వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాత్రి, పగలు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను సిఎం ఆదేశించారు.

హైదరాబాద్ కు చెందిన మంత్రులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయని, వరదలు వస్తున్నాయని, చాాలా చోట్ల రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు. ఏ జిల్లాకు చెందిన మంత్రి తన శాఖతో పాటు తన జిల్లాకు సంబధించిన పరిస్థితులను కూడా పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సూచనలు, ఫిర్యాదులు, వారి బాధలు తెలుసుకోవాలని, అందుకు అనుగుణంగా స్పందించాలని ఆదేశించారు. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చినట్లు సమాచారం అందిందని, ఈ పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పరచాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూాడా ప్రయాణాలు చేయకుంటే మంచిదని ముఖ్యమంత్రి చెప్పారు.