వాస్త‌వాల‌ను దాచిపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం!!

Posted February 3, 2017

kcr government secrets about nayeem
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ లో హతమైన తర్వాత అతనితో చాలామందికి లింకులున్నాయని ప్రచారం జరిగింది. అందులో ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నాయని పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకనో.. వెనక్కు తగ్గిందట. ఆ జాబితాలో టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీల నాయకులు ఉండడంతో ..రచ్చకు ఆస్కారం లేకుండా అందరి పేర్లను లైట్ తీసుకున్నారట. దీంతో నయీంతో నాయకులు, పోలీసులకు లింకులు లేవని అధికారికంగా తేల్చేసింది. ఇది ఎంత అబద్ధమో చెప్పడానికి కొన్ని ఫోటోలు ఇప్పుడు బయటపడ్డాయి.

పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లు సాక్ష్యాలు ల‌భించాయి. సీఐడీ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏసీపీ, ఎస్ఐ స్థాయి అధికారుల ఫోటోలు కూడా నెట్ లో తిరుగుతున్నాయి. అప్పట్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నయీం .. పోలీసు అధికారులను ఆహ్వానించాడట. దీంతో పోలీసు బాసులు దర్జాగా వచ్చి నయీంతో విందు ఆరగించారు. అంతేకాదు నయీంతో ఫోటోలు దిగి మురిసిపోయారు.

నయీంతో పోలీసులే కాదు.. రాజకీయ నాయకులు దిగిన ఫోటోలు కూడా ఉన్నాయట. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే వాటిని దాచిపెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ ఫోటోలను బయటకు తీస్తారని టాక్. ఇప్పుడు పోలీసుల ఫోటోలు బయటకు రావడానికి కూడా ఓ కారణం ఉందట. ఆ ఫోటోలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఈ మధ్య ఎక్స్ ట్రాలు చేస్తున్నారట. అతన్ని దెబ్బకొట్టేందుకే టీఆర్ఎస్ నేతలు ఫోటోల అస్త్రం ప్రయోగించారన్న వాదన వినిపిస్తోంది.

మొత్తానికి ఈ ఫోటోలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నయీం విషయంలో కొన్ని వాస్తవాలు దాచిందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. నయీంతో లింకుల వ‌ల్ల‌ టీఆర్ఎస్ నాయకులపై ఈగ కూడా వాలకుండా చూసుకుందని…అందుకోసం కేసీఆర్ సర్కార్ పక్కా స్కెచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్లాన్ కూడా బాగానే వర్కవుట్ అయ్యిందని ఇప్పుడు టీఆర్ఎస్ క్యాడరే గుసగుసలాడుకుంటున్నారు.