మోడీకి అండగా కేసీఆర్ ఉండగా..!!!

Posted February 1, 2017

kcr is back of modi
ప్రధాని మోడీకి బీజేపీ కూడా అంత అండగా ఉంటుందో లేదో కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆయ‌న‌కు ఔట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు. మోడీపై ఈగ వాలినా ఊరుకునేది లేదనే రేంజ్ లో మాట్లాడుతున్నారు. అంతేకాదు తన పార్టీ ఎంపీలు కూడా అదే రూట్ లో వెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.

అసలే బడ్జెట్ సెషన్. ఈ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైనా మోడీ సర్కార్ పై నోరుజారుతారేమోనని కేసీఆర్ ముందే గ్రహించినట్టున్నారు. అందుకే ఎంపీలకు క్లియర్ గా ఆదేశాలిచ్చారట కేసీఆర్. పార్లమెంటు నినాదాలు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారని టాక్. బడ్జెట్ ఎలా ఉన్నా.. ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పారట. తొందరపడకుండా.. ఆచితూచి మాట్లాడాలని చెప్పారని సమాచారం.

ప్రధాని మోడీతో మనకు కావలసిన పనులు చాలా ఉన్నాయని కుండబద్దలు కొట్టారట సీఎం కేసీఆర్. ఆ పనులేంటని గులాబీ ఎంపీలు తెగ చర్చించుకుంటున్నారు. అభివృద్ధి పనుల వరకు ఓకే గానీ… అంతకుమించి ఏమైనా పర్సనల్ పనులున్నాయా అని గుసగుసలాడుకుంటున్నారట‌. ఈ స్నేహబంధం చూస్తుంటే.. ఫ్యూచర్ లో ఏమైనా కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశముందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నిప్పు లేనిదే పొగ రాదు కదా!!