జానా ఇంటి పప్పు,పులుసు కెసిఆర్ కి ఓకే ..

Posted December 27, 2016

kcr lunch in janareddy house
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మరోసారి ప్రతిపక్ష నేత జానా రెడ్డి కి సంకటం తెచ్చి పెట్టారు . ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తెరాస సర్కార్ మీద జానా పూర్తి స్థాయిలో పోరాడడం లేదని విమర్శలొచ్చాయి. అయన మీద కొందరు కాంగ్రెస్ నాయకులే కుమ్మక్కు ఆరోపణలు చేశారు.వీటన్నిటినీ దాటుకుని ఇప్పుడిప్పుడే జానా గొంతు పెంచుతున్నారు .తెరాస సర్కార్ మీద దాడి ఉదృతం చేశారు .ఈ పరిస్థితుల్లో జానా కి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టారు సీఎం కెసిఆర్ .

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అసెంబ్లీ లో చర్చ జరుగుతున్నప్పుడు కెసిఆర్ తన మనసులో వున్నమాట బయట పెట్టారు .ఓ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత ఇంటికెళ్లి భోజనం చేయాలని ఉందని చెప్పారు . సంజీవరెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇలాంటి సంప్రదాయం పాటించేవాళ్ళని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు .త్వరలో తాను కూడా జానా ఇంటికి వెళతానని …అయన పప్పు ,పులుసు తో భోజనం పెట్టినా సంతోషంగా తిని వస్తానని కెసిఆర్ చెప్పారు .ఈ మాటలకి ముసిముసిగా నవ్వుకున్న జానా దాని వల్ల ఎదురయ్యే పరిణామాల్ని అంచనా వేసుకున్నారేమో…