మోడీ కి సలహాలిచ్చిన కెసిఆర్ …

Posted November 19, 2016

 

kcr meets modi

తెలంగాణ లో ప్రజలు పడుతున్న నోట్ల కష్టాలను సీఎం కెసిఆర్ మోడీ కి వివరించి సలహాలిచ్చారు . ఈ భేటీలో పెద్దనోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులను మోదీకి, కేసీఆర్‌ వివరించారు. కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల్లో మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశారు. గృహిణులు దాచుకున్న డబ్బులను నల్లధనంగా పరిగణించవద్దని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పాతనోట్లు స్వీకరించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. వీలైనంత త్వరగా రూ. 500 నోట్లు అందుబాటులోకి తేవాలని కేసీఆర్‌ విన్నవించుకున్నారు. అలాగే నోట్ల రద్దుతో వస్తుసేవలు, వాణిజ్యపన్నుల ఆదాయం, రవాణాశాఖ, ఎక్సైజ్ ఆదాయం చాలా వరక కోత పడిందని, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని, రిజిస్ట్రేషన్, రవాణా విభాగంలో ఆదాయం బాగా తగ్గిందని ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆదాయానికి గండి పడటంతో ఆ నష్టాన్ని భర్తీ చేయాలని కోరారు .

రైతులు పాత నోట్లు ఒకేసారి మార్చుకునేలా వేసులుబాటు కల్పించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పాతనోట్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరగా రైతులకు సహాయం అందించాలని కోరారు. వ్యాపారస్తులకు కొద్ది మేర వెసులుబాటు కల్పించాలని కేసీఆర్‌ కోరారు. అన్ని అంశాలు పరిశీలిస్తానని కేసీఆర్‌కు మోదీ హామీ ఇచ్చారు