కెసిఆర్ రైట్ హ్యాండ్ కమ్మ పురాణమిదే..

Posted December 1, 2016

Image result for kcr and tummala
ఓవైపు కొడుకు …మరోవైపు కూతురు ..ఇంకోవైపు మేనల్లుడు …ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కి మూడు వైపులా కుటుంబ సభ్యులే వున్నారు.మరి నాలుగో వైపు? టీ క్యాబినెట్ లో కీలక పాత్ర పోషిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు.పైకి ఎలా కనిపిస్తున్నా తెలంగాణాలో కాంగ్రెస్ కి అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గానికి కౌంటర్ గా కమ్మల్ని తెరాస కి దగ్గర చేర్చే పని తుమ్మల మీద పెట్టారంట కెసిఆర్.అందుకేనేమో ఇటీవల కుల వనభోజనాలకు వెళ్లిన తుమ్మల సరికొత్త పురాణం చెప్పారు.అదే కమ్మ పురాణం …అయన అక్కడ చెప్పిన కధ ఇదే ..

కమ్మవారికి బ్రహ్మ ఓ వరం ఇచ్చాడంట.అదేమిటంటే ..చీర కట్టినా ,పంచె కట్టినా,కౌంటర్ వేసినా,మాట మాట్లాడినా,ఏ రంగంలోకి వెళ్లినా కమ్మ వారికి ఎదురుండదు అని బ్రహ్మ వరం అంట.అయితే మిగతా కులాల వాళ్లంతా బ్రహ్మ దగ్గరికి వెళ్లి ఇదేమిటని అడిగితే నేను వరం ఇవ్వగలను గానీ వెనక్కి తీసుకోలేనని చెప్పారట.అయినా వారంతా ఒత్తిడి చేయడంతో కమ్మవారు ఒకరితో ఒకరు కలిసిపోకుండా చూస్తానని మాటిచ్చారట.తుమ్మల పురాణం లో నిజంవున్నా లేకున్నా అది విన్నవారికి అయన క్రియేటివిటీ నచ్చి తీరుతుంది.కానీ కెసిఆర్ టార్గెట్ కి తుమ్మల పురాణం ఎంతవరకు ఉపయోగపడుతుందో మాత్రం చెప్పలేము.