తెలంగాణలో ప్రజలతో ముఖ్యమంత్రి

0
106

 Posted May 9, 2017 at 16:06

kcr want to doing radio program like modi mann ki baat radio programఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ప్రజలతో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఎవరైనా తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎంకు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడదే పని కేసీఆర్ చేయబోతున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి.. ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజలతో మాట్లాడటానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం కోసం ప్రగతి భవన్లో సెపరేట్ స్టూడియో కూడా రెడీ అయిందట. అటు ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరుతో రేడియోకు మళ్లీ ప్రాచుర్యం తీసుకొస్తే.. ఇప్పుడు కేసీఆర్ తనదైన శైలిలో కొత్త ప్రోగ్రామ్ హ్యాండిల్ చేస్తారని గులాబీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్న కేసీఆర్.. ఓవైపు వివిధ వర్గాలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. కానీ తన స్కీములకు ఆశించినంత పబ్లిసిటీ దక్కడం లేదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రులకు కనీసం తమ శాఖల్లో అమలయ్యే పథకాలపై కూడా పట్టు లేదని క్యాబినెట్ మీటింగుల్లో తేలిపోతుంది. అందుకే వీరిని నమ్ముకుంటే పనికాదని.. స్వయంగా రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్. ఎప్పుడో ఒకసారి సభ పెడితేనే కేసీఆర్ మాటలకు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది.. అలాంటిది డైరక్టుగా లైవ్ లో జనంతో మాట్లాడితే ఆ కిక్కే వేరంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

మోడీ మన్ కీ బాత్ ను మించి కేసీఆర్ ప్రోగ్రామ్ హైలైట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఇక్కడే ఓ చిక్కు ఉంది. కేసీఆర్ కు ఏ ప్రోగ్రామ్ కూడా సుదీర్ఘ కాలం కొనసాగించిన ట్రాక్ రికార్డ్ లేదు. సమయపాలన కూడా అంత కరెక్టుగా పాటించరనే విమర్శ ఉంది. అలాంటిది ప్రతిరోజూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నాళ్లు కొనసాగించగలరని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తరహాలో టైమ్ సెన్స్ కేసీఆర్ కు లేదనే విమర్శలకు.. ఇప్పుడీ కొత్త ప్రోగ్రామే జవాబు చెప్పబోతోంది.