అందాలు చూపేదిలేదన్న శైలజ ..

0
111
 keerthi suresh no skin show any movieతెలుగులో కీర్తి సురేష్ ఇప్పటికి రెండు సినిమాలు చేసింది. అందులో ఒకటి రిలీజ్ కూడా అవకపోయినా.. రామ్‌తో జోడీ కట్టి శైలజగా ఆకట్టుకుంది. నేను..శైలజ హిట్ అయినా అమ్మడు చాలాకాలం పాటు మరో మూవీ సైన్ చేయకపోవడంతో.. ఆఫర్లు రాలేదని చాలామంది కామెంట్స్ చేశారు కానీ.. ఈమె వేరే ప్రాజెక్టుల్లో తెగ బిజీ అయి పోయింది.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ 60వ సినిమాలోను శివ కార్తికేయన్ తో రెమో.. బాబీ సింహాతో పాంబు సాండైలతో పాటు.. తెలుగులో నానికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది కీర్తి. తెలుగులో వెంట వెంటనే అవకాశాలు రాకపోవడానికి.. కీర్తి గ్లామర్ రోల్స్ కి సై అనక పోవడమే అనే కారణం వినిపించింది. అయితే.. ఏ భాషలో అయినా గ్లామర్ చూపిచే ప్రసక్తే లేదని తేల్చేసిన ఈ మలయాళీ కుట్టి.. అలాంటి రోల్స్ తనకు సరిపడవని చెప్పింది. అయితే.. తెలుగోళ్లు అందాలు చూపించమన్నారటగా అంటే మాత్రం.. అలా చేయాలని తననెవరూ అడగలేదని తేల్చేసింది.
మరి రెమ్యూనరేషన్ పెంచేశావని పుకార్ల సంగతేంటి బేబీ అంటే.. తనకు ఇంకా అంత డిమాండ్.. అర్హత రాలేదనకుం టున్నా అంటూ ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చిందీ  భామ.ఇప్పట్లో ప్రేమా గీమా జాన్తా నై అంటున్న కీర్తి సురేష్.. అంతగా ప్రేమలో పడ్డా సరే నో ప్రాబ్లెం అనేసింది. తన అమ్మా నాన్నలు లవ్ మ్యారేజ్ చేస్కున్నారు కాబట్టి.. ఒక వేళ తనకు అదే పరిస్థితి వచ్చినా ఆశీర్వదించే స్తారని కాన్ఫిడెంట్ గానే ఉంది కీర్తి.