బ్రహ్మి కి ఖైదీ తో నో యూజ్?

Posted February 1, 2017

khaidi no 150 movie hit but brahmanandam get no new movie offers
“అనుష్కని కాదని బ్రహ్మీని తీసుకున్నాం”… వినడానికి కాస్త ఎబ్బెట్టుగా వున్నా ఇదే నిజమని ఖైదీ నెంబర్ 150 దర్శకుడు వి.వి.వినాయక్ స్వయంగా చెప్పిన విషయం.ఓ స్టార్ హీరోయిన్ కి బ్రహ్మి ఆల్ట్రనేటివ్ అని చిరు నమ్మడం వల్ల సినిమా కథ కూడా మారింది.సెకండ్ హీరోయిన్ రోల్ వెళ్ళిపోయి కథలోకి డాబర్ మెన్ గా బ్రహ్మి ఎంట్రీ ఇచ్చాడు.సినిమా విడుదలైంది.మెగా స్టార్ స్టామినాకి తగ్గట్టే కలెక్షన్స్ వచ్చాయి.బ్రహ్మి కూడా కాసేపు నవ్వులు పూయించారు.అంతవరకు బాగానే వుంది కానీ ఆ సినిమా వల్ల బ్రహ్మికి ఒక్క కొత్త ఆఫర్ కూడా రాలేదట.అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది.స్వయంగా తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని బ్రహ్మి కబురు చేసినా ఓ స్టార్ దర్శకుడు అవసరమైతే చూస్తామని చెప్పాడట.

ఈ పరిస్థితి ఇలా కావడానికి ఓ నటుడిగా బ్రహ్మి కి రిటైర్మెంట్ దగ్గరకి రావడమే కారణమని కొందరు అంటున్నారు గానీ అసలు విషయం వేరే ఉందట.సెట్స్ మీద బ్రహ్మి ప్రవర్తన ,చిత్ర యూనిట్ తో ఆయన బిహేవియర్,ఇక డబ్బులు,భోజనాల దగ్గర బ్రహ్మి పేచీలు …వెరసి ఇవన్నీ కలిసి బ్రహ్మి కి అవకాశాలు రాకుండా చేస్తున్నాయట.ఒకప్పుడు ఆల్ట్రనేటివ్ లేక బ్రహ్మి ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించేవారట.ఇప్పుడు సీన్ మారిపోయింది.జబర్దస్త్ తర్వాత కమెడియన్స్ కి కొదవ లేకుండా పోయింది.కమెడియన్స్ మీద ఖర్చు కూడా తగ్గింది.మొత్తానికి చిరు చొరవ చూపి బ్రహ్మి కి ఓ దారి చూపుదామనుకున్నా ఖైదీ తో ఆయనకి ఒరిగింది సున్నా.