కాంగ్రెస్ లోకి కిర‌ణ్ రీఎంట్రీ?

Posted February 9, 2017

kiran reentry to congress party
స‌మైక్య‌రాష్ట్రానికి ఆఖ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కిర‌ణ్… రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా..? త్వ‌ర‌లోనే సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్ట‌బోతున్నారా..? పాత టీమ్ లోనే జాయిన్ అయ్యేందుకు సిద్ధ‌మవుతున్నారా.. ? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

జై స‌మైక్యాంధ్ర పేరుతో గ‌త ఎన్నిక‌ల్లో సొంత పార్టీ పెట్టి క్లీన్ బౌల్డ్ అయిన కిర‌ణ్ ఆ త‌ర్వాత తెర‌మ‌రుగైపోయారు. కుదిరితే హైద‌రాబాద్ లో లేక‌పోతే… బెంగ‌ళూరులో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న‌పై విప‌రీత‌మైన ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కొంత‌మంది ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నార‌ట‌. దీంతో ఇన్నాళ్లూ ఊగిస‌లాట‌లో ఉన్న కిర‌ణ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధ‌మైపోయిన‌ట్టు స‌మాచారం.

కిర‌ణ్ ఒక నిర్ణ‌యం తీసుకుంటే.. దానికి క‌ట్టుబ‌డేందుకు అప్ప‌ట్లో ఆయ‌న‌తో న‌డిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉన్నార‌ట‌. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన నాయ‌కులంతా కిర‌ణ్ ద‌గ్గ‌ర‌కు రావ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని టాక్. అయితే కిర‌ణ్ మాత్రం క‌చ్చితంగా కాంగ్రెస్ లోకి వ‌స్తేనే… తాము వెంట న‌డుస్తామ‌ని ష‌ర‌తు పెట్టార‌ట‌. దీంతో అన్నీ ఆలోచించిన ఆయ‌న కూడా ఆదిశ‌గానే అడుగులేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ ఏపీలో కాంగ్రెస్ జీరోకు చేరిపోయింది. కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా బ‌ల‌మైన నేత కోసం అన్వేషిస్తోంది. అందుకే ఈ అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టి… టీడీపీ, వైసీపీకి గ‌ట్టి షాకిచ్చేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్నార‌ట‌. ఈ మేర‌కు కాంగ్రెస్ హైకమాండ్ తోనూ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఇప్ప‌టికే కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీతోనూ కిర‌ణ్ కుమార్ రెడ్డి మాట్లాడార‌ని టాక్. తిరిగి వ‌స్తే.. త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని రాహుల్ కూడా అభ‌య‌మిచ్చార‌ట‌. దీంతో ఇక కాంగ్రెస్ లో ఆయ‌న చేరిక లాంఛ‌న‌మేన‌ని చెబుతున్నారు. కిర‌ణ్ తో పాటు అప్ప‌ట్లో ఆయ‌న వెంట న‌డిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తిరికి కాంగ్రెస్ కండువా వేసుకోబోతున్నార‌ని టాక్. వీరంతా ఒకేరోజు కాంగ్రెస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సో… ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కిర‌ణ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి…