డాక్ట‌ర్ కేసీఆర్!!

Posted December 26, 2016

kodandaram about doctor kcr
తెలంగాణ సీఎం కేసీఆర్ కు డాక్ట‌రేట్ ఏమైనా వ‌చ్చిందా అని ఆశ్చ‌ర్య‌పోకండి.. ఆయ‌న ఎంబీబీఎస్ చ‌ద‌వ‌లేదు.. డాక్ట‌రేటూ రాలేదు. విష‌యం ఏంటంటే టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ … కేసీఆర్ ను డాక్ట‌ర్ తో పోల్చారు. ఒక డాక్ట‌ర్ మందు ఇవ్వ‌కుంటే… ఇంకొక డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు పోకుండా ఉంటామా… అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పుడున్న డాక్ట‌ర్ త‌న వైఖ‌రిని మార్చుకుంటార‌ని ఆశిస్తున్నా… వైఖ‌రి మార‌కుంటే ఏమ‌వుతుందో మీరే చూస్తార‌ని తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వ విధానాల‌పై కోదండరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంస‌తృప్తి వ‌ల్లే ఆయ‌న ప్ర‌భుత్వానికి దూర‌మ‌య్యారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షం కంటే కూడా కోదండ‌రామ్ పైనే సీఎం కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. అంత‌లా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు కోదండ‌రామ్. తాజాగా ఆయ‌న చేసిన డాక్ట‌ర్ కామెంట్స్ తో లొల్లి మ‌రింత ముదిరే అవ‌కాశ‌ముంది.

కోదండరామ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వానికి పెద్ద మైన‌స్ అవుతున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే కోదండ‌రామ్ నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడారు. ప్ర‌తి విష‌యంలోనూ వాస్త‌వముంటేనే మాట్లాడతారని తెలంగాణ‌లోని విద్యార్థి, మేధావిలోకం భావిస్తుంది. తెల‌గాణ ఉద్య‌మంలోనూ ఆయ‌న స‌క్సెస్ కావ‌డానికి అదే కార‌ణం. కానీ ఇప్పుడు ఆయ‌న ప్ర‌భుత్వంపై చేస్తున్న వ్య‌తిరేక కామెంట్స్ తో అన్ని వ‌ర్గాల జ‌నం అవునా!!.. ప్ర‌భుత్వం స‌రైనా డైరెక్ష‌న్ లో పోవడం లేదా!!.. అని చ‌ర్చించుకుంటున్నారట‌… అదే జ‌రిగితే కేసీఆర్ ప్ర‌భుత్వానికి క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేన‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు..