ముద్రగడ బాటలో కోదండ …టీడీపీ మద్దతు

Posted December 29, 2016

kodandaram Inmates in his home as like mudragada t tdp party support him
కాపు ఉద్యమ నేత ముద్రగడ బాటలోనే ఓ అడుగేశారు టీ జాక్ చైర్మన్ కోదండ రామ్.భూసేకరణ చట్టంలో మార్పులకి డిమాండ్ చేస్తూ నిర్వాసితులతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలని టీ జేఏసీ నిర్ణయించింది . అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జాక్ ఆ ధర్నా వాయిదా వేసింది .కానీ అత్యవసరంగా సమావేశమైన జాక్ నేతల తీర్మానంతో కోదండరాం ఇంటిలోనే దీక్షకి దిగారు .పోలీసులు నిరంకుశంగా జాక్ ,నిర్వాసిత నేతల్ని అరెస్ట్ చేశారని దానికి నిరసన తెలిపేందుకే ఈ దీక్ష చేస్తున్నట్టు కోదండ అంటున్నారు. విషయం తెలుసుకున్న జాక్ నేతలు ,కార్యకర్తలు,సామాన్య ప్రజలు కోదండరాం నివాసానికి చేరుకుంటున్నారు .వీరిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు .కాపు రిజర్వేషన్ డిమాండ్ తో ముద్రగడ ఇలాగే ఇంటిలో దీక్షలకు పెట్టింది పేరు .ఇప్పుడు ఆయన్ని కోదండ ఫాలో అవుతున్నారు .ఇంటిలో దీక్ష ఏమిటి అంటూ ఏపీలో తెలుగు తమ్ముళ్లు ముద్రగడని ఎద్దేవా చేసేవాళ్ళు .ఇప్పుడు తెలంగాణాలో కోదండ మ్యాటర్ తెలియగానే టీడీపీ నేతలు అయన దీక్షకి మద్దతు ప్రకటించారు .