కాంగ్రెస్ ఎంపీల వల్ల ఆంధ్రాకి అన్యాయం..కోదండరాం

  kodandaram said congress mp behavior ap loss
విభజన సమయంలో ఆంధ్రాకి అన్యాయం జరగడానికి ముఖ్య కారణం ఆంధ్ర కాంగ్రెస్ ఎంపీలా? ఔననే అంటున్నారు తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఇదేదో ఆరోపణలా అయన చెప్పలేదు.రెండు ప్రాంతాల ప్రజల మధ్య కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డా …కాంగ్రెస్ హైకమాండ్ విభజనకి మొగ్గు చూపుతున్నా.. ఇవేమీ పట్టించుకోకుండా సమైక్యమంటూ అర్ధం లేని ఉద్యమం చేయడానికి కాంగ్రెస్ ఎంపీ లే కారణమని అయన అభిప్రాయపడ్డారు.పరిస్థితిని అంచనా వేసుకొని ఆంధ్రాకి రావాల్సిన విషయాలపై నాడు అధికారపార్టీ ఎంపీలు దృష్టి పెట్టి ఉంటే ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదని కోదండ రామ్ అన్నారు.

ఈ విషయం గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఆ రోజుల్లో ప్రజల సెంటిమెంట్ ని బట్టి నడవాల్సి వచ్చిందని చాలా మంది మాజీ ఎంపీలు చెబుతున్న మాట .అది నిజం కూడా.కానీ ఢిల్లీ పరిణామాల్ని అంచనా వేసుకుని ..ప్రజలకి వాస్తవాలు వివరించగలిగితే పరిస్థితి మారేదేమో.తొలుత కొంత వ్యతిరేకత వచ్చినా క్రమంగా మార్పు వచ్చేదేమో.అప్పట్లో ఆ దిశగా పురంధరేశ్వరి లాంటి వాళ్ళు ఒకటిరెండు సార్లు మాట్లాడి సాటి నేతల నుంచి మద్దతు రాక మౌనం దాల్చారు.అయినా జనం నాడిని బట్టి నడిచే నాయకుల కన్నా జనానికి దేని వల్ల మేలు జరుగుతుందో చెప్పగలిగే నాయకుల అవసరం దేశానికి ఉందని చెప్పేందుకు ఈ వ్యవహారం మరో ఉదాహరణ.