గ్యారేజ్ సీన్ దించేస్తున్నారట..!

Posted November 25, 2016

Koratala Repeate That Magic Againయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయిన సగతి తెలిసిందే. సినిమాలో బెస్ట్ సీన్స్ లో గవర్నమెంట్ ఆఫీస్ లో రాజీవ్ కనకాల సీన్ అని అందరు చెబుతారు. ఓ విధంగా సినిమాను ఓ రేంజ్లోకి లేపింది ఆ సన్నివేశమే. అయితే ప్రస్తుతం కొరటాల శివ మహేష్ తో మూవీకి సిద్ధమవుతున్నాడు. భరత్ అను నేను టైటిల్ ప్రచారం లో ఉన్న ఈ సినిమాలో కూడా గ్యారేజ్ లోని ఆ సీన్ లానే హైలెట్ గా నిలిచే ఓ సీన్ రాసుకున్నాడట కొరటాల శివ.

ఇప్పటికే ఆ సీన్ తన సన్నిహితులతో డిస్కస్ చేస్తే గ్యారేజ్ కు ఆ సీన్ లానే రాబోయే సినిమాకు కూడా ఈ సీన్ అంత వర్క్ అవుట్ అవుతుందని అంటున్నారట. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న మహేష్ కొరటాల మూవీ ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ ను సిఎంగా చూపించబోతున్న కొరటాల శివ ఈ సినిమా కూడా సూపర్ హిట్ గ్యారెంటీ అనేస్తున్నాడు. కథా బలంతో కమర్షియల్ సక్సెస్ కొడుతున్న కొరటాల శివ టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. వచ్చే ఏడాది దసరా రిలీజ్ ప్లాన్ చేస్తున్న మహేష్ కొరటాల శివ మూవీలో హీరోయిన్ కోసం వేట మొదలైంది.