గ్యారేజ్ లో తప్పులున్నాయ్..!

Posted November 24, 2016

koratala siva shock janata garrage demeritsజనతా గ్యారేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి తెలుగు ప్రేక్షకులు చూపించిన సినిమా. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తారక్ కెరియర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఇంతటి సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు కొరటాల శివ చివరకు ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక అందులో కొన్ని లోపాలున్నాయని బాంబ్ పేల్చాడు. అవునా ఏంటి ఇదంతా అంటే.. శివరాజ్ కనుమూరి దర్శక నిర్మాతగా శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా ట్రైలర్ రిలీజ్ చేశాడు కొరటాల శివ.

ఈ సందర్భంలోనే సినిమా మొత్తం ముందే చూసేశాడనుకుంటా ఎలాంటి లోపం లేకుండా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అని కొరటాల శివ అన్నారు. ఓ మంచి సినిమా అది కూడా ప్రేక్షకులు మెచ్చే సినిమా తీయాలంటే కచ్చితంగా అన్ని కాంబినేషన్ కుదరాలి కాని జనతా గ్యారేజ్ లో కొన్ని కుదరలేదు. గ్యారేజ్ లో లోపాలున్నాయని స్వయంగా కొరటాల శివనే ఒప్పుకున్నాడు.

సినిమా హిట్ అయ్యి వెళ్లింది కాబట్టి కొరటాల శివ ఇప్పుడు గ్యారేజ్ లో లోపాలున్నయన్నా లేవన్నా ఎవరు పట్టించుకోరు. అయితే రిలీజ్ టైంలో ఫస్ట్ డే రోజు కూడా సినిమా మీద వచ్చిన డివైడ్ టాక్ కు కాస్త సీరియస్ అయిన కొరటాల శివ ఇప్పుడు చిన్నగా లోపాలున్నాయని చెప్పడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.