క్రిష్‌ ‘మణికర్ణిక’కు ఆదిలోనే హంసపాదు

0
109

Posted May 19, 2017 at 15:58

krish produce in manikarnika movie
బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌తో ఒక భారీ, మంచి సినిమాను తెరకెక్కించాడు. దాంతో ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్న నేపథ్యంలో క్రిష్‌ మాత్రం బాలీవుడ్‌లో జాన్సీ లక్ష్మి జీవిత కథతో ‘మణికర్ణిక’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ను పోషించబోతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథను అందించబోతున్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న సమయంలోనే సినిమా వివాదంలో ఇరుక్కుంది. 2015వ సంవత్సరంలో ఇదే కథతో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కేతన్‌ మెహత సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేక పోయాడు. తాజాగా క్రిష్‌ ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టిన తర్వాత ఆయన తన ప్రాజెక్ట్‌ను హైజాక్‌ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను అనుకున్న కథతో క్రిష్‌ సినిమాను మొదలు పెడుతున్నాడంటూ ఆయన బాలీవుడ్‌ దర్శకుల మండలిలో మరియు నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రారంభంకు ముందే మణికర్ణిక వివాదంలో ఇరుక్కోవడంతో క్రిష్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి.