ప‌వ‌న్ కు చెక్ పెట్టిన కేటీఆర్!!!!

Posted February 1, 2017

ktr made samantha as brandambasder for cloth weaving
తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏక్ష‌ణంలోనూ చేనేత‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారో కానీ… దానికి మ‌ద్ద‌తు మాత్రం బాగా వ‌స్తోంది. ప్ర‌తి సోమ‌వారం చేనేత బ‌ట్ట‌లే ధ‌రించి తానే అంద‌రికీ రోల్ మోడ‌ల్ గా నిలుస్తున్నారాయ‌న‌. మొత్తానికి ఈ చేనేత టాపిక్ తో కేటీఆర్ ఇమేజ్ మ‌రింత పెరిగింది. ఈ ప‌రిస్థితుల్లో చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుకొచ్చారు. ప‌వ‌న్ ఎంట్రీతో త‌న ఇమేజ్ త‌గ్గి…. ఆయ‌న‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని కేటీఆర్ భావించార‌ట‌. అందుకే ఈ ఇష్యూతో ప‌వ‌న్ కు త‌గిన మైలేజ్ రాకుండా ప‌క్కా ప్లాన్ వేశార‌ట‌. ప‌వ‌న్ కు పోటీగా మ‌రో సినీతార‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట కేటీఆర్. అందులో భాగంగానే చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు స‌మంతను తెర‌పైకి తెచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది.

త్వ‌ర‌లోనే అక్కినేని వారింటి కోడ‌లు కాబోతున్న స‌మ్మూ… మంత్రి కేటీఆర్ ను క‌లిసి చేనేత‌కు జై కొట్టింది. తెలంగాణ చేనేత స‌హ‌కార‌సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. అయితే స‌మ్మూ ఎంట్రీ వెన‌క బ‌ల‌మైన కార‌ణం కేటీఆరేన‌ని చెబుతున్నారు. త‌న‌తో స‌న్నిహితంగా ఉండే నాగార్జున‌తో ఆయ‌న మాట్లాడారట‌. చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండాల‌ని… స‌మ్మూను ఒప్పించాల‌ని కోరార‌ట‌. ఆ ప్ర‌తిపాద‌న‌ను నాగార్జున … స‌మ్మూకు చెప్ప‌డం … ఆమె వెంట‌నే ఒప్పుకోవ‌డం వెంట‌నే జ‌రిగిపోయాయి.

కేటీఆర్ … సమంత‌ను ముందుకు తీసుకురావ‌డంపై ప‌వ‌న్ ను దెబ్బ‌కొట్టేందుకేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే ప‌వ‌న్ ఇప్పుడు జ‌న‌సేన రాజ‌కీయ పార్టీ పెట్టారు. ఆయ‌న చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే ఎంతో కొంత ప‌వ‌న్ పార్టీకి ల‌బ్ధి చేకూరుతుంది. ఫ్యూచ‌ర్ లో ఎప్పుడైనా ఈ అంశం ప‌వ‌న్ కు ప్ల‌స్ అయ్యే అవ‌కాశ‌ముంది. అందుకే తెలంగాణ నుంచి ఆయ‌న దూరం చేసి… ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం చేయాల‌ని కేటీఆర్ ఎత్తుగ‌డ వేశార‌ని టాక్. అన్నీ ఆలోచించే స‌మంత‌వైపు మొగ్గు చూపార‌న్న వాద‌న వినిపిస్తోంది.

స‌మంత‌.. ప‌వ‌న్ కు మంచి జోడీగా పేరు తెచ్చుకుంది. ప‌వ‌న్ అంత కాక‌పోయినా.. ఆమెకు కూడా మంచి ఫాలోయింగే ఉంది. అందుకే స‌మ్మూ అయితే… ప‌వ‌న్ ను కొంతైనా సైడ్ చేయొచ్చ‌ని కేటీఆర్ స్కెచ్ వేశార‌ట‌. తాను అనుకున్న ప్లాన్ ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఆయ‌న‌ స‌క్సెస్ అయ్యార‌ని టీఆర్ఎస్ క్యాడ‌ర్ గుస‌గుస‌లాడుకుంటున్నారు. ముఖ్యంగా స‌మంత రాక‌తో… చేనేత అంశంలో ఇప్పుడు ప‌వ‌న్ ఏపీకే పరిమితం అయ్యార‌ని చెప్ప‌డం క‌రెక్టేనేమో?