కాంగ్రెస్ కి బీజేపీ షాక్ ట్రీట్ మెంట్…

Posted November 19, 2016

Kurien said KVP Bill a Financial Bill
అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లు అంశం…పార్టీ కి ఏపీలో ఫేస్ సేవింగ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిందనే చెప్పాలి. అప్పట్లో దీనిపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఇరుకున పడింది. అయితే ఎప్పటికప్పుడు ఈ బిల్లుపై చర్చను వాయిదా వేస్తూ వచ్చిన బీజేపీ… తాజాగా ఈ బిల్లును రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు  ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్‌బిల్లును ద్రవ్య బిల్లుగా ప్రకటించారు కేవీపీ ప్రైవేట్‌ బిల్లుపై చర్చ, ఓటింగ్ ఉండదని కురియన్ స్పష్టం చేశారు.

దీంతో కంగు తిన్న కాంగ్రెస్… రాజ్యసభ కార్యాలయం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిందని… దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించింది. మరోవైపు బీజేపీ నేతలు సమయం చూసుకుని ఈ బిల్లును లేపేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద నోట్లపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలు చేయలేని పరిస్థితి, ఒక్క కేవీపీ కి తప్ప కాంగ్రెస్ కి కూడా పెద్ద ఆసక్తి ఉన్నట్టు లేదు అన్నట్టే వుంది ఈ మేటర్ గురించి .