మొద‌టిరోజు స్కూల్ లో ఉన్న‌ట్టే..!

0
84

Posted April 17, 2017

kushboo says about pawan kalyan trivikram movie shootingకుష్బూ. ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. ఆమెను త‌మిళ ప్రేక్ష‌కులు దేవ‌త‌గా ఆరాధించారు. గుళ్లూ గోపురాలు క‌ట్టి పూజించారు. అదే స‌మ‌యంలో తెలుగు. క‌న్న‌డ‌, మ‌ళ‌యాల ప్రేక్ష‌కులు  కూడా ఆమెకు నీరాజ‌నాలు ప‌లికారు. సినీ ప్ర‌పంచంలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు ఎదిగి కుటుంబం కోసం సినిమాల‌కు గుడ్ బై చెప్పారు  కుష్బూ. త‌ర్వాత రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు. చానాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న కుష్బూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే రీ ఎంట్రీకి త‌మిళం కాకుండా తెలుగు సినిమాను ఎంచుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో వ‌స్తున్న చిత్రంలో  కుష్బూ న‌టిస్తున్నారు త్రివిక్ర‌మ్ చెప్పిన క‌థ‌, అందులో త‌న పాత్ర న‌చ్చ‌డంతో ఈ సినిమా చేయ‌టానికి అంగీక‌రించాన‌న్నారు కుష్బూ. చాలా రోజుల త‌ర్వాత షూటింగ్ లో పాల్గొన‌టం మొద‌టి రోజు స్కూల్ వెళ్లిన‌ట్టే ఉంద‌ని, మ‌ర్చిపోవాల్సిన‌వి, నేర్చుకోవాల్సిన‌వి చాలా ఉన్నాయ‌ని  ట్విట్ట‌ర్ లో తెలిపారు. ఎన్నో సినిమాల్లో అల‌వోక‌గా న‌టించిన కుష్బూ ఇలాంటి మాట‌లు చెప్ప‌టం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని మెచ్చుకుంటున్నారు చిత్ర యూనిట్‌.