రోజాకి చుక్కలు చూపించిన మహిళా జర్నలిస్ట్..

Posted February 14, 2017

lady journalist shocked to mla roja at ysrcp party officeరాజకీయాల్లో సంస్కారయుతమైన మాట, భాష కోసం ఎదురుచూడటమంటే నేతిబీరకాయలో నేతి కోసం వెదికినట్టే.అందుకే ఏ రాజకీయ నేత ప్రెస్ మీట్ కి వెళ్లినా…వాళ్ళు ఏమి మాట్లాడినా అయ్యో ఇలా మాట్లాడుతున్నారేంటి అని జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపడే పరిస్థితి లేదు.వారికి నేతల భాష,పద్ధతి అలవాటు అయ్యాయి.ఏమీ చేయలేనప్పుడు చూస్తూ ఊరుకోవడమే మేలని భావించే పరిస్థితికి వచ్చారు జర్నలిస్టులు.ఇలా జర్నలిస్టుల్లో స్తబ్దత కూడా రోజా వంటి వారికి వేరే విధంగా అర్ధమైనట్టుంది.ప్రెస్ మీట్స్ లో ఆమె ప్రత్యర్థి పార్టీ తో పాటు ఓ జర్నలిస్ట్ పేరు చెప్పి తనకి తోచినట్టు మాట్లాడింది.ఆ జర్నలిస్ట్ కూడా ప్రెస్ మీట్ లో వృత్తి ధర్మం పాటించింది.ప్రెస్ మీట్ కాగానే రోజా హాయిగా వెళ్లిపోతుంటే అసలు రచ్చ మొదలైంది.ప్రెస్ మీట్ లో ఆమె తన పేరు ఎత్తడాన్ని తప్పుబట్టి సారీ చెప్పాల్సిందే అని ఆ మహిళా జర్నలిస్ట్ రోజాని డిమాండ్ చేయడమే కాదు.చుక్కలు చూపించింది .అప్పటికప్పుడు ఏదో మేనేజ్ చేసి రోజా బయటపడినా జర్నలిస్టులతో కూడా నోటిదూకుడు చూపిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఆమెకి అర్ధమై ఉండాలి.మొత్తానికి రోజాకి చుక్కలు చూపించిన మహిళా జర్నలిస్ట్ ని సాటి విలేకరులు మెచ్చుకున్నారు.వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ తర్వాత హీట్ రేపిన ఆ ఎపిసోడ్ మీరూ చూడండి…