శాతకర్ణి లో లగాన్ డైరెక్టర్ హ్యాండ్ ?

Posted December 13, 2016

lagaan director hand in sathakarni
గౌతమీపుత్ర శాతకర్ణి …బాలయ్య చిత్ర ప్రస్థానంలో 100 వ సినిమా …ఈ సినిమా ఆయనకి వెరీ స్పెషల్. అంతకన్నా స్పెషల్ గా భావిస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. బాలయ్య నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు చారిత్రక సినిమా తో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని క్రిష్ తపించిపోతున్నాడు. ఆ తపనకు తగ్గట్టే శాతకర్ణి అవుట్ ఫుట్ వచ్చిందట. అయితే అతి విశ్వాసానికి పోకుండా ఇలాంటి చారిత్రక సినిమాలు తీసిన బాలీవుడ్ డైరెక్టర్ …లగాన్ ఫేమ్ అశుతోష్ గోవారికర్ ని క్రిష్ కలిశాడట.ఆయనకి సినిమా రషెస్ చూపించి ఏదైనా మార్పులు చేర్పులు అవసరమనుకుంటే సూచించాలని అడిగాడట. జోధా అక్బర్ లాంటి చారిత్రక సినిమాలు తీసిన అశుతోష్ శాతకర్ణి చూసి ఆశ్చర్యపోయాడట. ఒక చిన్న సూచన మాత్రమే చేసి…ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని క్రిష్ కి చెప్పాడంట.
ఈ బడ్జెట్ ఇంత గొప్ప సినిమా ఇంత తక్కువ టైం లో తీయడం ఎలా సాధ్యమైందని క్రిష్ ని అశుతోష్ ప్రశ్నించాడట. అయితే అశుతోష్ పొగడ్తల కన్నా అయన ఇచ్చే సూచన మీదే క్రిష్ దృష్టి ఉందట. అశుతోష్ సూచన అమలు చేసాక సినిమా స్థాయి ఇంకా పెరిగిందని క్రిష్ ఖుషీ అయిపోతున్నాడంట.ఈ సినిమా అవుట్ ఫుట్ చూసే మోక్షజ్ఞని క్రిష్ చేతిలో పెట్టేందుకు బాలయ్య రెడీ అయిపోయిన విషయం తెలిసిందే.ఏమైనా లగాన్ దర్శకుడు సైతం శాతకర్ణిని ఇంతగా మెచ్చుకున్న విషయం తెలిస్తే బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులుండవు.