వైసీపీకి లక్ష్మీపార్వతి గుడ్ బై?

Posted December 24, 2016

lakshmi parvathi goodbye to ycp
ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీపార్వతి రాజకీయ జీవితం తలకిందులైపోయింది. ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో ఓ వెలుగు వెలిగిందామె. రాజకీయమంతా ఆమె చుట్టే నడించింది. అప్పట్లో టీడీపీలో వచ్చిన సంక్షోభానికి లక్ష్మీపార్వతే కారణమని చెబుతుంటారు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆమె ఎన్టీఆర్ పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. కానీ ఏం లాభం.. అక్కడా ఆమెకు నిరాశే మిగిలింది. చివరకు వైసీపీలో చేరిపోయారామె.

వైసీపీలో లక్ష్మీపార్వతికి తగిన గౌరవం లభించలేదని ఆ పార్టీ క్యాడరే చెబుతున్నారు. పార్టీ మీటింగ్స్ లో ఎక్కడా ఆమెకు ప్రాధాన్యమివ్వరు. ఆమె సలహాలను పట్టించుకోరు. కనీసం ఆమె వయస్సుకైనా జగన్ గౌరవమివ్వరని టాక్. దీంతో లక్ష్మీపార్వతి చాలా కాలంగా వైసీపీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అనవసరంగా వైసీపీలో ఉండడం ఎందుకని ఆమె ఆలోచిస్తున్నారట. మరో పార్టీలోకి వెళ్లలేరు.. వైసీపీలో ఉండలేరు .. ఇదీ ప్రస్తుతం లక్ష్మీపార్వతి పరిస్థితి.

విధిలేని పరిస్థితుల్లోనే లక్ష్మీపార్వతి వైసీపీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విషయ పరిజ్ఞానమున్నా.. ఆమెకు ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చే గౌరవం కూడా ఆమెకు ఇవ్వకపోవడం ఎంత వరకు సబబో… వైసీపీ నాయకులకే తెలియాలి. ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఇక గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి లక్ష్మీపార్వతి వచ్చారట. బీజేపీ నుంచి ఆమెకు ఆఫర్ ఉందని టాక్. ఎలాగూ పురంధేశ్వరి ఉన్నారు. లక్ష్మీపార్వతి కూడా వచ్చేస్తే.. ఎన్టీఆర్ అభిమానులను తమవైపుకు తిప్పుకోవచ్చని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది వర్కవుట్ అవుతుందా.. లేదా అన్నది వేచి చూడాలి.