తాజా సర్వే తర్వాత పవన్ మీద జగన్ ఫోకస్..

Posted November 24, 2016

navajyoth singh sidhu caughtమారుతున్న పరిస్థితులకి తగ్గట్టు రాజకీయ వాతావరణాన్ని వడిసిపట్టేందుకు వైసీపీ నిరంతరం సర్వే లు చేయిస్తున్న విషయం తెలిసిందే..తాజాగా ఆ పార్టీ జరిపిన సర్వే లో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయంట.ఆ సర్వే ఫలితాల ప్రకారం 2014 తో పోలిస్తే అధికార తెలుగుదేశం బలం బాగా తగ్గిపోయింది.ముఖ్యంగా అప్పట్లో వన్ సైడ్ విక్టరీ సాధించిన పశ్చిమ గోదావరి,అనంతపురం జిల్లాల్లో టీడీపీ భారీగా నష్టపోయింది.ఇక రాజధాని ప్రభావం పడ్డ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ టీడీపీ కి లాభం లేకపోగా ఎంతోకొంత నష్టమే ఉంటుందని వైసీపీ సర్వేలో తేలిందట.ఈ సర్వే చూడగానే జగన్ సంతోషపడాలి కదా …కానీ అదే లేకుండా చేసింది సర్వే లోని ఇంకో అంశం.టీడీపీ బలహీనపడుతున్న స్థాయిలో,ఆయా జిల్లాల్లో వైసీపీ బలపడటం లేదని సర్వే నివేదికలు వచ్చాయి.

తాజా సర్వే మీద వైసీపీ వ్యూహకర్తలు చర్చించిన మీదట ఓ అభిప్రాయానికి వచ్చారట.ఏపీ లో మూడవ పార్టీకి అవకాశముందని సర్వే తో తేటతెల్లమైంది కాబట్టి ఇక పవన్ మీద ఫోకస్ పెంచాలని వైసీపీ భావిస్తోందట.విపక్ష ఓట్ల చీలికను నివారించలేకపోతే అధికార పక్షం మళ్లీ లాభపడుతుందని జగన్ ఆందోళన పడుతున్నారు.అందుకే ఎన్నికల వాతావరణం రాకముందే చంద్రబాబుకి తాను తప్ప పవన్ ప్రత్యామ్న్యాయం కాదని చాటేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించాలని థింక్ ట్యాంక్ ని ఆదేశించారట.