మెగా ఐటెం సడెన్ షాక్.. బీచ్ లో ఆపని !

 Posted October 31, 2016

lisa haydon wedding with her boyfriend dino lalvani‘రచ్చ’ చేసి మెగా ఐటమ్ గా ముద్రవేయించుకొంది లిసా హేడన్.ఈ మోడల్ కం యాక్టర్ లిసా హేడన్ రామ్ చరణ్  ‘రచ్చ’ సినిమా టైటిల్ సాంగులో..డ్యాన్స్ అదరగొట్టింది.ఇప్పుడీ భామ సడెన్ షాక్ ఇచ్చింది.తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది లిసా.ప్రూప్ కోసం బీచ్ లో మొగుడి పెదాలని జుర్రుతుండగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇప్పుడు ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా..పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటన్ వ్యాపారవేత్త డినో లల్వానితో చాలాకాలం నుండి ప్రేమాయణం నడిపిస్తోంది.నెల క్రిందట త్వరలోనే డినోను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది.ముందు తెలిపిన విధంగానే తాజాగా,ధాయిలాండ్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది.తన మ్యారేజ్ ఫోటోలన్నీ స్వయంగా తనే షేర్ చేసింది.బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది లిసా.కంగనా రనౌట్ నటించిన’క్వీన్’ సినిమాతో లిసా మెరిసింది.ఈ మధే ప్రేక్షకుల ముందుకొచ్చిన  “ఏ దిల్ హై ముష్కిల్” సినిమాలో కూడా ఓ స్పెషల్ రోల్ చేసింది.