జగన్ ను డిసైడ్ చేసుకోవాలంటున్న లోకేశ్

Posted December 15, 2016

lokesh warning jaganటైమ్, ప్లేస్ నువ్వు డిసైడ్ చేసుకో.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా .. ఎక్కడైనా .. ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా.. నటసింహం బాలయ్యది. అచ్చం ఇదే రేంజ్ లో జగన్ కు వార్నింగ్ ఇచ్చారు లోకేశ్.

ఈ మధ్య జగన్ ను ఎక్కువగా కౌంటర్ చేస్తున్నారు లోకేశ్. ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధిపై ఫోకస్ పెట్టడంతో .. ఆయనకు వీలైనంత సమయం దొరకడం లేదు. జగన్ పార్టీ చేస్తున్న ఆరోపణలను పట్టించుకునేంత సమయం ఆయనకు లేదు. ఈ టైమ్ లో వైసీపీ నుంచి ఆరోపణలు శృతిమించడంతో కౌంటరిచ్చేందుకు లోకేశ్ రంగంలోకి దిగారు. జగన్ కు ధీటుగా బదులిస్తూ దూసుకుపోతున్నారు.

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఇటీవల లోకేశ్ పర్యటించారు. టీడీపీపై జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారాయన. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్నారు. టైమ్, ప్లేస్ డిసైడ్ చేసుకోవాలని జగన్ ను ఛాలెంజ్ చేశారు. ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగంగానే జరుగుతోందట. రాజకీయాల్లో ఇక మరింత వేగం పెంచాలని లోకేశ్ భావిస్తున్నారట. అందుకే జగన్ మాటలు ఎక్కువ ఫోకస్ అవ్వకుండా తానే స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇప్పటికే టీడీపీలో లోకేశ్ క్రియాశీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత ఆస్థానం తీసుకోవాలని పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో తాను కూడా ఆదిశగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ను కార్నర్ చేయడం ద్వారా విపక్షానికి స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు.