మోది గురించి తెలుగు రచయిత స్పందన..!

Posted November 21, 2016

Lyricist Ananth Sreeram Response For Banned Notesఏదైనా సందర్భం వస్తే దేశ భక్తిని చాటుకోవాలని చూసే రచయితల్లో అనంత్ శ్రీరాం ఒకరు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సలాం ఇండియా అంటూ ఓ సాంగ్ రాసి కంపోజ్ చేసి విజువల్ గా చూపించిన అనంత్ శ్రీరాం ఇప్పుడు దేశంలో హాట్ న్యూస్ గా నడుస్తున్న నోట్ల రద్దు మీద కూడా నోరు విప్పాడు. రచయిత కాబట్టి తను చెప్పే మాటలు కచ్చితంగా కాస్త వ్యంగ్యంగానే ఉంటాయి.

మోదిని విమర్శిస్తున్న వారికి చెంపపెట్టుగా తన మాటలతో రాసుకున్న వాటిని తను రికార్డ్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో వదిలాడు అనంత్ శ్రీరాం. ప్రస్తుతం వైరల్ గా పాకుతున్న ఆ వీడియో అందరిని ఆలోచింప చేస్తుంది. ‘ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటాం.. నిజంగానే ఎవడైనా ఏదైనా చేస్తుంటే మాత్రం ఎద్దేవా చేస్తాం.. భారతీయులమండి.. మేం భారతీయులం’ అని అన్న అనంత్ శ్రీరాం ఇక మోదికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి గురించి ‘మకిలీ పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం’ అంటూ ఏకిపారేశాడు. ఒకరని పేరు పెట్టి అనలేదు కాని అనంత్ శ్రీరాం స్పందించిన విధానం సెలబ్రిటీస్ అందరిలోనూ ఓ ఉత్సాహాన్ని తెచ్చింది.