మహేష్ ఎన్టీఆర్ మధ్య దూరం లేదట…

Posted November 12, 2016

mahesh and ntr friends no cold war in between themసూపర్‌స్టార్‌ మహేష్‌కు, జూనియర్‌ ఎన్టీయార్‌కు మధ్య దూరం పెరిగిందని కొన్ని మీడియాల్లో హాట్ న్యూస్ గా వినిపిస్తోంది. ఐతే ఈ ప్రచారానికి వారు వినిపిస్తున్న కారణం కూడా ఆసక్తిగా ఉందండోయ్ ..అదేంటంటే తెలుగు ఇండస్ట్రీలో తోటి హీరోలందరితోనూ సన్నిహితంగా ఉండే మహేష్‌.. ఎన్టీయార్‌కు దూరంగా ఉండడానికి 2009 ఎన్నికల సందర్భమే కారణమని ముడి పెట్టారు .

గతంలో ఎప్పుడో ఎన్నికలలో జూనియర్‌ ఎన్టీయార్‌ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాడు. వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రసంగాలకు విశేష ఆదరణ లభించింది. ప్రచారం లో భాగంగా కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న గల్లా అరుణకుమారి నియోజకవర్గంలో కూడా టీడీపీ తరపున ఎన్టీయార్‌ ప్రసంగం చేయాల్సి ఉంది.

మహేష్‌కు బావ అరుణ్ కుమార్ అనే విషయం తెలిసిందే. అందుకే మహేష్‌.. ఎన్టీయార్‌కు ఫోన్‌ చేసి ఆ నియోజకవర్గంలో పర్యటించవద్దని కోరాడట.మహేష్‌ కోరికను ఎన్టీయార్‌ ఓకే అన్నాడట..తరువాత టీవీ ఆన్‌ చేసిన మహేష్‌ షాకయ్యాడట.తను ఎన్టీయార్‌కు చేసిన పర్సనల్‌ రిక్వెస్ట్‌ గురించి మీడియాలో వచ్చేసిందట. తను వ్యక్తిగతంగా అడిగిన విషయాన్ని ఎన్టీయార్‌ మీడియా ముందు పెట్టడం మహేష్‌ను తీవ్రంగా బాధించిందట. అప్పట్నుంచి ఎన్టీయార్‌కు మహేష్‌ దూరంగా ఉంటున్నాడనేది పాయింట్ ఇక్కడ.

ఆ తర్వాత మహేష్‌, ఎన్టీయార్‌ చాలాసార్లు కలుసుకున్నారు. 2011లో జరిగిన ఎన్టీయార్‌ పెళ్లికి మహేష్‌ హాజరయ్యాడు.అంతెందుకు ఎన్టీయార్‌ నటించిన ‘బాద్షా’ సినిమాకు మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ కూడా ఇచ్చాడు.ఎన్టీయార్‌తో మహేష్‌కు సన్నిహిత సంబంధాలు లేవనేది కేవలం గాసిప్స్…కదా