మహేష్ కొరటాల శివ మూవీ లాంచ్..!

Posted November 9, 2016

bm1916శ్రీమంతుడు కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని తెలిసిందే. ప్రస్తుతం మహేష్ చేస్తున్న మురుగదాస్ సినిమా పూర్తి కాగానే కొరటాల శివతో సినిమాకు ఫిక్స్ అయ్యాడు. జనవరిలో స్టార్ట్ అవుతున్న ఈ సినిమాకు ఈరోజు ముహుర్తం పెట్టారు. అయితే మహేష్ మాత్రం ఈ ముహుర్తపు కార్యక్రమానికి డుమ్మా కొట్టాడు. ముందు కార్యక్రమంలో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నా కొన్ని కారణాల వల్ల ఆగాల్సి వచ్చిందట.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి హీరోయిన్ ఫైనలైజ్ అవని ఈ సిన్నిమా రెగ్యులర్ షూట్ జనవరి నుండి జరుపుకోనుంది. శ్రీమంతుడు సినిమాతో మహేష్ స్టామినా ఏంటో తెలిసేలా చేసిన కొరటాల శివ మళ్లీ అదే రేంజ్ హిట్ సినిమా ఇస్తానని నమ్మకంతో చెబుతున్నారు.

ఈ కథ కూడా సోషల్ మెసేజ్ తో కూడుకున్నదే అట. అంతేకాదు టైటిల్ గా ‘భరత్ అను నేను’ అని ప్రచారం జరుగుతుంది. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడట. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.