‘స్పైడర్‌’ కారణంగా ‘భరత్‌ అను నేను’ ఆలస్యం!

0
102

Posted April 26, 2017 at 13:12

mahesh bharath ane nenu movie shooting late because of spyder movie
‘జనతాగ్యారేజ్‌’ చిత్రం విడుదలైన వెంటనే కొరటాల శివ తన తర్వాత సినిమాను మహేష్‌బాబు హీరోగా చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే కొరటాల శివ, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో మూవీ ఫిబ్రవరి లేదా మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సింది. కాని మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘స్పైడర్‌’ చిత్రం చాలా ఆలస్యంగా షూటింగ్‌ జరుగుతుంది. అనుకున్నదానికంటే రెండు నెలు ఆసల్యం షూటింగ్‌ అవుతుండటంతో పాటు విడుదలకు కూడా చాలా ఆలస్యం కానుంది.

‘స్పైడర్‌’ చిత్రం మొదట జూన్‌లో విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. కాని ఆగస్టు లేదా సెప్టెంబర్‌కు సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. మరో వైపు కొరటాల శివ సినిమాను కూడా జులై లేదా ఆగస్టులో ప్రారంభించాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు. దాదాపు సంవత్సర కాలం పాటు కొరటాల శివ ‘జనతాగ్యారేజ్‌’ తర్వాత ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ‘స్పైడర్‌’ కారణంగా కొరటాల శివ టైం వృదా అవుతుంది. సూపర్‌ హిట్‌ను, బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు ఇంత గ్యాప్‌ తీసుకోవడం చాలా అరుదు. కాని మహేష్‌బాబుతో మరో సినిమా చేయాలనే బలమైన కోరిక కొరటాలకు ఉండటం వల్ల ఇంత గ్యాప్‌ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన ఈ సినిమాకు ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పొలిటికల్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సంవత్సరంలో కొరటాల మరో సినిమా లేనట్లే అని తేలిపోయింది.