మహేష్ ముఖ్యమంత్రి.. ముహుర్తం ఫిక్స్

Posted November 5, 2016

mb1516మహేష్, కొరటాల కాంబినేషన్లో శ్రీమంతుడు సినిమా ఎన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. ప్రస్తుతం మురుగదాస్ తో మూవీ చేస్తున్న మహేష్ కొరటాల శివతో సినిమాకు ఈ నెల 9న ముహుర్తం పెట్టనున్నారట. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఆడియెన్స్ కు అందిస్తున్నారు.

ఇక ఇప్పుడు మహేష్ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడట. ఇక ఈ సినిమాను ‘భరత్ అను నేను’ టైటిల్ పెడుతున్నట్టు ప్రచారంలో ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు. సో మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు ఇదో గుడ్ న్యూస్ అని చెప్పాలి. 2017 దసరాకి ఈ సినిమా రిలీజ్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.