ఏంటి.. మహేష్ కామెడీ చేస్తున్నాడా..?

 Posted February 14, 2017

mahesh koratala siva new movie detailsప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్ తన తదుపరి సినిమాని లైన్లో పెట్టేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో అనూహ్య విజయాన్ని అందించిన  కొరటాల శివకు ఓకే చెప్పాడు మహేష్.

కొరటాల దర్శకత్వం వహించబోయే ఈ తాజా  సినిమాకు  ‘భరత్ అను నేను’ అనే టైటిల్ ను పెట్టే యోచనలో ఉన్నాడట మహేష్. కాగా ఈ సూపర్ స్టార్ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సినిమాలో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటుందని, మహేష్ అవుట్ అండ్ అవుట్ కామెడీని పండించనున్నాడని అనుకుంటున్నారు. ఏప్రిల్ చివరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న కొందరు సినీ విశ్లేషకులు ఖలేజా సినిమాలో కూడా మహేష్ కామెడీ పండించాడని, ఆ సినిమా అతని కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ అవ్వలేదని అంటున్నారు. మరి తాజాగా ఈ  సినిమాలో  కామెడీతో మహేష్ ఎలా అలరిస్తాడో  చూడాలి.