మహేష్ మూవీ చేతులు మారిందా..!

mahesh

Image result for mahesh babu

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా షురూ చేసిన మహేష్ ఆ తర్వాత సినిమా కూడా ప్లాన్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి బ్యానర్లో మహేష్ సినిమా ఉంటుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇటీవల పివిపి కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం డిక్లేర్ చేశాడు. అయితే ఏమైందో ఏమో కాని ఈ ప్రాజెక్ట్ పివిపి నుండి దిల్ రాజు చేతుల్లోకి వెళ్తుందట.

మహేష్ తో ఇప్పటికే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తీసిన పివిపి మరో సినిమా తీసేనుకు సిద్ధం అవుతున్నా మహేష్ మాత్రం పివిపి సినిమా అంటే బ్యాడ్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడట. ఊపిరి, కాష్మోరా హిట్లతో ఈ సంవత్సరం కాస్త పర్వాలేదనిపించుకున్నా మహేష్ కు మాత్రం నమ్మకం కుదరట్లేదు. ఇక మహేష్ కన్నా ఫ్యాన్స్ ఈ విషయం మీద చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది.

మురుగదాస్ సినిమా జనవరి కల్లా పూర్తి చేసి ఫిబ్రవరి నుండి కొరటాల శివ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్న మహేష్ వంశీ పైడిపల్లి సినిమా 2017 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేస్తారట. మహేష్ కోసం ఏకంగా రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్న వంశీ ఎట్టకేలకు సినిమా కన్ఫాం చేసుకున్నాడు. మరి నిర్మాత దిల్ రాజు ఉంటాడా పివిపినే కంటిన్యూ అవుతాడా అన్నది త్వరలో తెలుస్తుంది.