మహేష్ సినిమాపై మరో రూమర్..!

Posted December 13, 2016

Mahesh Murugadoss Movie Sensational Rumoursసూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ మూవీ ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి పోస్టర్ బయటకు రాకపోవడంతో సినిమా మీద రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. నిన్న మొన్నటిదాకా సినిమా టైటిల్ మీద న్యూస్ హల్ చల్ చేయగా ఇప్పుడు మరో రకంగా రూమర్స్ వస్తున్నాయి. అదెలా అంటే మురుగదాస్ కోలీవుడ్ హీరో విజయ్ తో తీసిన సినిమా తుపాకి అసలైతే ఆ సినిమాను తెలుగులో మహేష్ తో రీమేక్ చేయాలని చూశారు. కాని రీమేక్ అంటే ఇష్టం ఉండని మహేష్ అలాంటి కథతో రమ్మని మురుగదాస్ కు చెప్పాడట.

కొద్దిపాటి గ్యాప్ తీసుకుని మురుగదాస్ ఈ సినిమా కథతో వచ్చాడట. సో వినిపిస్తున్న వార్తల ప్రకారం తుపాకి సీక్వల్ గా మహేష్ సినిమా ఉండబోతుందని హాట్ రూమర్. దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో తెలియదు కాని మహేష్ సినిమాపై వస్తున్న ఈ నెగటివ్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కాస్త కంగారులో ఉన్నారు. ప్రస్తుతం టైటిల్ గా వినిపిస్తున్న సంభవామి అయినా నిజమా కాదా అన్నది ఇంకా కన్ ఫ్యూజన్ వీడలేదు.

మరి సినిమా స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులవుతున్నా ఎలాంటి అప్డేట్ రివీల్ చేయకపోతే ఇలానే నచ్చిన వారు నచ్చినట్టుగా రకరకాలుగా రాసుకుని వెళ్తుంటారు. ఈ వ్యవహారం అంతా సినిమా బిజినెస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మహేష్ అండ్ టీం ఈ విషయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిందని చెబుతున్నారు సిని విమర్శకులు.