శర్వా సినిమాలో మహేష్,ఎన్టీఆర్,బన్నీ?

  Posted January 10, 2017

mahesh ntr bunny in sharwanand sathamanam bhavathi
ఓ వైపు మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 ..ఇంకోవైపు నందమూరి నటసింహం బాలయ్య 100 వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి . ఓ విధంగా వెండితెరపై రెండు సినీ దిగ్గజాలు ఢీకొడుతున్నాయి.అయినా దిల్ రాజు ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా సంపూర్ణ విశ్వాసం,నమ్మకంతో శతమానంభవతి సినిమా ని సంక్రాంతికే విడుదల చేయబోతున్నాడు. శర్వానంద్ లాంటి చిన్న హీరో, ఓ ప్లాప్ సినిమా తీసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ని పెట్టుకుని ఏమిటా ధైర్యం అని చాలా మంది అంటున్నారు.అయినా కధ మీద నమ్మకంతో దిల్ రాజు ముందుకెళ్తున్నాడని సరిపెట్టుకున్నారు.కధ,కధనం తో పాటు ఓ స్వీట్ షాక్ కూడా ఈ సినిమాలో ఉందంట.

శర్వా శతమానంభవతి లో మహేష్,ఎన్టీఆర్,బన్నీ కనిపించబోతున్నారట.దిల్ రాజు తో వున్న సాన్నిహిత్యం కొద్దీ వాళ్ళు ఏదో ఓ సీన్ లో లేదా పాటలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయి వుంటారనుకోవచ్చు.అదేమీకాదట …కధలో భాగంగానే వీళ్ళు కనిపిస్తారట.అయితే వాళ్ళు నేరుగా కెమెరా ముందుకు రాలేదట.కేవలం ఇంతకుముందు వారి సినిమాల్లోని సన్నివేశాల్ని శతమానంభవతి కధ కి సెట్ అయ్యేలా వాడుకున్నారట. అలా మహేష్,ఎన్టీఆర్,బన్నీ కనిపించే సీన్స్ ఈ సినిమాకే హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ నమ్ముతోంది.కధ తో పాటు ఇలాంటి సర్ ప్రయిజ్ ఎలెమెంట్స్ ఉండటంతో దిల్ రాజు ఈ సినిమా మీద గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.