భ‌ర‌త్ అనే నేనుతో క‌లిసి కైరా అద్వానీ

0
248

 

Posted April 18, 2017

mahesh screen share with kiara advani in bharath ane nenu movieకెరీర్ తొలినాళ్ల‌లో త‌ప్ప ఎక్కువ‌గామ‌న హీరోలు స్టార్ హీరోయిన్ల‌తోనే సినిమాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో ఒక‌టి, రెండు హిట్లు కొట్టిన హీరోయిన్ల‌కే త‌మ సినిమాల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు ఇచ్చుకుంటూ పోతారు. ప్రిన్స్ మ‌హేష్ బాబూ ఇందుకు మిన‌హాయింపు కాక‌పోయినా అప్పుడ‌ప్పుడుమాత్రం కొత్త‌వాళ్ల‌కు చాన్స్ ఇస్తుంటాడు.. మూడేళ్ల క్రితం వ‌చ్చిన నేనొక్క‌డినేలో కొత్త హీరోయిన్ కృతిస‌న‌న్ కు అవ‌కాశమిచ్చాడు మ‌హేష్‌. ఆ సినిమా డివైడ్ టాక్ తో నడిచినా…క్లాస్ హీరోగా మ‌హేష్ బాబుకు తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.

హీరోయిన్ వ‌ల్ల హిట్టూ, ఫ‌ట్టూ లాంటి సెంటిమెంట్లేవీ ప‌ట్టించుకోని మ‌హేష్ బాబు ఇప్పుడు ఇంకోసారి మ‌రో కొత్త హీరోయిన్ తో న‌టించేందుకు అంగీక‌రించాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌బోతున్న భ‌ర‌త్ అనే  నేనులో కైరా అద్వానీ తో క‌లిసి స్క్రీన్ పంచుకోనున్నాడు. కైరా తెలుగుతెర‌కు కొత్త గానీ బాలీవుడ్ కు కాదు. ఎంఎస్ ధోనీ సూప‌ర్ హిట్ బ‌యోపిక్ తో బాలీవుడ్ లో మెరిసిన కైరా ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తొలి సినిమాలోనే మ‌హేష్ తో న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది.  శ్రీమంతుడి త‌ర్వాత త‌మ కాంబినేష‌న్లో వ‌స్తున్న చిత్రం ఇదే కావ‌టంతో కొర‌టాల ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఎప్పుడూ సొంత కథ‌ల‌తోనే సినిమా తీసే కొర‌టాల ఈ సారి మ‌హేష్ కోసం శ్రీహ‌రి నాను అనే ర‌చ‌యిత ద‌గ్గ‌ర క‌థ కొన్నుక్కున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ విష‌యంలోనూ టాలీవుడ్ స్టార్ల‌ను కాద‌ని బాలీవుడ్ భామ‌ను ఎంపిక‌చేశాడు.