తంబికి దొరకని టైటిల్… మండిపడుతున్న మహేష్

Posted February 1, 2017

mahesh serious about new movie titlesటాలీవుడ్ టాప్ హీరోగా వెలుగుతున్న మహేష్ బాబు కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతన్న ఈ సినిమాలో మహేష్ న్యాయవాది పాత్రలో , ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.  సినిమా రిలీజ్ కి పబ్లిసిటీ ఎంత ముఖ్యమో… సినిమా పేరు కూడా అంతే ముఖ్యమన్న విషయం తెలిసిందే. కాగా మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో ద్విభాషా చిత్రంగా  తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ విషయంలో క్లారిటీ రాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో మహేష్.. మురుగదాస్  పై మండిపడుతున్నాడని అంటున్నారు. టాలీవుడ్ లో ఎంతోమంది డైరక్టర్లు ఉన్నా కానీ మహేష్ మాత్రం కోలీవుడ్ లో టాప్ డైరక్టర్ అయిన మురుగదాస్ కి అవకాశం ఇచ్చాడు.  ఏరికోరి ఎంచుకున్న దర్శకుడు… రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇప్పటివరకు టైటిల్ ను ఫైనలైజ్ చేయలేదటని గుర్రుగా ఉన్నాడట మహేష్.

అయితే ఈ  సినిమాకు  చట్టంతో పోరాటం, ‘నేను సైతం’  టైటిల్స్ ని సెలెక్ట్ చేసినా అవి మెగాస్టార్ సినిమాలకు సంబంధింనవి కావడం, తాజాగా  ఏజెంట్ శివ టైటిల్ ని పరిశీలిస్తుండడంతో మహేష్…  దర్శకుడిపై అసహనం చూపించాడట. ఈ పేర్లు తప్ప మీకు ఇంకేమీ దొరకలేదా అంటూ రెండు భాషలకు సరిపోయే విధంగా మంచి టైటిల్ ని పెట్టాలని గట్టిగానే చెప్పాడట.  ఎప్పూడూ శాంతగా, చిరునవ్వుతో కనిపించే మహేష్ కోపం చూసి … సినిమా టైటిల్ పై ఎంత జాగ్రత్తగా ఉన్నాడో తంబికి అప్పుడు అర్ధమయ్యిందట.