మహేష్‌ ఈ సారి కూడా నిరాశేనా..!

0
98

Posted April 22, 2017 at 11:46

mahesh spyder movie again postponed
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌ ఫిక్స్‌ కాకముందే విడుదల తేదిని ప్రకటించాడు దర్శకుడు. ఇటీవలె టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెడికల్‌ స్టూడెంట్‌గా నటిస్తోంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రంకోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మురుగదాస్‌ ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించాడు.

మొదటి నుండి ఫస్ట్‌లుక్‌ ఎప్పుడో వస్తుంది అని భావించిన అభిమానులకు మహేష్‌ చాలా సందర్భాలు నిరాశే మిగిల్చాడు. ఇకపోతే జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది కదా అని అభిమానులు ఆశగా ఎదురు చూడగా ఇప్పుడు మరోసారి అభిమానులకు నిరాశనే మిగిల్చేలా ఉన్నాడు. మహేష్‌ ‘స్పైడర్‌’ జూన్‌ 23న విడుదల కావడం దాదాపు క్యాన్సిల్‌ అయినట్టే. ఎందుకంటే మహేష్‌ చిత్రం విడుదల ఆలస్యం అయ్యేలా ఉంది కాబట్టే నాని ‘నిన్ను కోరి’ చిత్రం, బన్నీ ‘డీజే’ చిత్రాలు అదే రోజున విడుదల కాబోతున్నాయి. క్రేజీ చిత్రంగా రాబోతున్న ‘స్పైడర్‌’ జూన్‌ 23న ఉంటే బన్నీ, నానిలు కచ్చితంగా మహేష్‌తో పోటీ పడరు కదా అందుకే మహేష్‌ చిత్రం ఈసారికి వాయిదా పడినట్టే. దాంతో అభిమానులు మళ్లీ నిరాశ పడుతున్నారు.